మ‌రో తొమ్మిది మందిపై లైంగిక ఆరోప‌ణ‌ల కేసు!

ఆరోప‌ణ‌లు ఎదుర్కోన్న వారిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Update: 2024-10-10 16:30 GMT

జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదికతో మాలీవుడ్ ఇండ‌స్ట్రీ బండారం బ‌య‌ట ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే బాధితులంతా ముందుకొచ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయంపై పోరాటం చేస్తున్నారు. చ‌ట్ట‌ప‌రంగా శిక్షించాల‌ని బాధిత మ‌హిళ‌లంతా ముందుకెళ్తున్నారు. ఆరోప‌ణ‌లు ఎదుర్కోన్న వారిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. కొంద‌ర్ని పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డం జ‌రిగింది.

ఈ ప‌రంప‌ర ఇంకా అలా కొన‌సాగుతూనే ఉంది. తాజాగా ఓ మహిళా నిర్మాత ఫిర్యాదు మేరకు పోలీసులు 9 మంది నిర్మాతల సంఘం ఆఫీస్ బేరర్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రముఖ నిర్మాతలు ఆంటో జోసెఫ్, లిస్టిన్ స్టీఫెన్ ఇతరుల పేర్లు కూడా ఉండ‌టం సంచ‌ల‌నంగా మారింది. త‌న‌ని అసోసియేష‌న్ స‌మావేశానికి పిలిపించింది దారుణంగా ప్ర‌వ‌ర్తించార‌ని, స్త్రీత్వాన్ని కించపరిచారని మహిళా నిర్మాత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

హేమ క‌మిటీ నివేదిక త‌ర్వాత కేసుల‌ను ద‌ర్యాప్తు చేయ‌డానికి ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసారు. నేరుగా ఆ బృందానికే బాధిత మ‌హిళ ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెంట‌నే వెలుగులోకి వ‌చ్చింది. ఫిర్యాదు మేరకు ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు కేసు న‌మోదైంది. తాను నిర్మించిన కొన్నిసినిమాల‌కు సంబంధించి అసోసియేషన్‌తో కొన్ని వివాదాలు ఉన్నాయని, ఇదే విషయమై మాట్లాడేందుకు అసోసియే షన్ అధికారులు తనను సమావేశానికి పిలిచారని నిర్మాత ఫిర్యాదు చేశారు.

ఆ స‌మ‌యంలో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించార‌ని ఆమె ఫిర్యాదు లో పేర్కొన్నారు. సోష‌ల్ మీడియా ద్వారా ఈ విష‌యాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇదిలా ఉంటే నిర్మాత మిను మునీర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీనా ఆంటోనీ అన్నారు. సోషల్ మీడియా ద్వారా పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారనే కారణంతో ఈ చర్య తీసుకున్నారు.

Tags:    

Similar News