బన్నీ-త్రివిక్రమ్ 16 నెలలు షూటింగ్ కేనా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని గురూజీ పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నాడు. కథకి మైథలాజికల్ టచ్ ఇచ్చి తన మార్క్ ని దాటి చేస్తోన్న చిత్రంగా తెలుస్తోంది. ఇప్పటివరకూ గురూజీ ఫ్యామిలీ యాక్షన్ చిత్రాలే చేసారు. కానీ ఇది పాన్ ఇండియా కావడంతో? త్రివిక్రమ్ తనలో రచనకు మరింత పదును పెట్టాడు. పాన్ ఇండియాకి కనెక్ట్ అయ్యే చిత్రంతో రాబోతున్నాడు.
తాజాగా ఈసినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఈసినిమా షూటింగ్ కోసమే త్రివిక్రమ్ 16 నెలలు ప్లాన్ చేస్తున్నారు. కేవలం షూటింగ్ కోసమే ఏడాదిన్నర కేటాయిస్తున్నారుట. అంటే ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడో? అర్దమవుతుంది. స్టోరీ ఏంటి? అన్నది లీక్ అవ్వలేదు గానీ 16 నెలలు కేటాయిస్తున్నాడంటే? ఆ కథ స్పాన్ ఎలా ఉంటుందో అంచనా వేయోచ్చు. పాన్ ఇండియా సినిమా ఆలస్యమైనా? అద్భుతం చేసేలాగే త్రివిక్రమ్ ప్లానింగ్ కనిపిస్తుంది.
దీంతో 2025 ఇదే క్రేజీ కాంబినేషన్ కూడా అవుతుంది. వచ్చే ఏడాది చాలా మంది స్టార్ హీరోల చిత్రాలు సెట్స్ కి వెళ్తాయి. కానీ ఎన్ని ఉన్నా? బన్నీ- త్రివిక్రమ్ మాత్రం క్రేజీ కాంబినేషన్ అవుతుంది. ఇంత వరకూ ఈ కలయికలో వైఫల్యం లేదు. చేసిన మూడు సినిమాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాంటి వైఫల్యం లేని కాంబో ఇప్పుడు పాన్ ఇండియాకి చేతులు కలపడంతో? అంచనాలు పీక్స్ కి చేరుతున్నాయి.
రైటర్ గా..దర్శకుడిగా త్రివిక్రమ్ అనుభవం గురించి చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్ చిత్రాలపై మంచి గ్రిప్ ఉన్న దర్శకుడు. అతడి సినిమాలకు, కథలకు స్పూర్తి కొన్ని హాలీవుడ్ సినిమాలుగా కూడా కనిపిస్తుంది. అలాంటి డైరెక్టర్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు? అంటే ఇంకే రేంజ్ లో వర్క్ చేస్తాడో చెప్పాల్సిన పనిలేదు.