బన్నీ రేంజ్ ని టచ్ చేయడం అంత వీజీ కాదు!
అక్షరాల ఒక్కో ప్రకటనకి 6 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు వినిపిస్తుంది. ఇకపై బన్నీ నుంచి ఏ కార్పోరేట్ కంపెనీకైనా యాడ్ షూడ్ కావలంటే అంత మొత్తం చెల్లించుకోవాల్సిందేనని తెలుస్తోంది.
బ్రాండింగ్స్ ని ఎండార్స్ చేయడంలో టాలీవుడ్ నుంచి టాప్ లో ఉన్నది ఇద్దరే ఇద్దరు. ఒకరు సూపర్ స్టార్ మహేష్ అయితే ..మరొకరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇద్దరిలో ఒక్కో యాడ్ కి ఎవరు? ఎక్కువ ఛార్జ్ చేస్తా రంటే? మహేష్ పేరే వినిపిస్తుంది. సినిమాల్ని మించిన ఆదాయం బ్రాండింగ్స్ తో ఉంటుంది. ఈ విషయంలో ఇంతవరకూ మహేష్ కి దీటుగా ఏ హీరో లేడు అన్నది వాస్తవం. ఒక్కో ప్రకటనకి కోట్ల రూపా యలు ఛార్జ్ చేస్తారాయన.
అయితే తాజాగా మహేష్ కి పోటీగా ఐకార్ స్టార్ అల్లు అర్జున్ సీన్ లోకి వచ్చినట్లు సమాచారం. పాన్ ఇండియాలో `పుష్ప` విజయం...అదే సినిమాకి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడంతో బన్నీ రేంజ్ ఇప్పుడు అంతకంతకు రెట్టింపు అయింది. ఇప్పుడా క్రేజ్ ని తెలివిగా ఎన్ క్యాష్ చేసుకుం టున్నట్లు ప్రచారం సాగుతోంది. బన్నీ ఇప్పుడు ఒక్కో యాడ్ కి కోట్లకు పైగా ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం.
అక్షరాల ఒక్కో ప్రకటనకి 6 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు వినిపిస్తుంది. ఇకపై బన్నీ నుంచి ఏ కార్పోరేట్ కంపెనీకైనా యాడ్ షూడ్ కావలంటే అంత మొత్తం చెల్లించుకోవాల్సిందేనని తెలుస్తోంది. బన్నీ ఎండార్స్ మెంట్ విషయంలో చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా వచ్చిన ఏ ప్రకటన వదలడు. అన్నింటా బన్నీ కనిపిస్తుంటాడు. అయితే ఇకపై ఆ ఛాన్స్ తీసుకుంటారా? లేక ఛార్జ్ రెట్టింపు అయిన నేపథ్యంలో సెలక్టివ్ గా ఉంటారా? అన్నది తెలియాలి.
సాధారణంగా పారితోషికాలకు సంబంధించి మీడియా ప్రచారం ఏది నిజం కాదు. డబ్బు విషయం ఏ హీరో రివీల్ చేయడు కాబట్టి దీన్ని ప్రచారంగానే భావించాలి. మరి ఈ ప్రచారంపై బన్నీ ఏదైనా హింట్ ఇస్తాడేమో చూడాలి. ప్రస్తుతం బన్నీ `పుష్ప-2` షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రెండవ భాగంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా షూట్ పూర్తిచేసిన వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడు.