'గేమ్ ఛేంజ‌ర్' ద‌ర్శ‌కర‌చ‌యిత‌లు మూర్ఖులు.. 'లోక్ సత్తా' జేపీ విమ‌ర్శ‌లు!

ఈ సినిమా కంటెంట్ ని క్రిటిక్స్ తీవ్రంగా విమ‌ర్శించారు. ఇప్పుడు లోక్ సత్తా అధినేత‌, మాజీ ఐఏఎస్ అధికారి జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసారు.

Update: 2025-02-24 03:48 GMT

రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా ఎస్.శంక‌ర్ తెర‌కెక్కించిన `గేమ్ ఛేంజ‌ర్` ఈ ఏడాది బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీగా రికార్డుల‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కంటెంట్ ని క్రిటిక్స్ తీవ్రంగా విమ‌ర్శించారు. ఇప్పుడు లోక్ సత్తా అధినేత‌, మాజీ ఐఏఎస్ అధికారి జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసారు. అంతేకాదు ఈ సినిమా తీసిన ద‌ర్శ‌కుడు, స్క్రిప్టు ర‌చ‌యిత‌ల‌ను మూర్ఖులు అంటూ తీవ్రంగా విమ‌ర్శించారు. గేమ్ ఛేంజ‌ర్ లో ద‌ర్శ‌కుడు చూపించాల‌నుకున్న అంశం పూర్తిగా త‌ప్పుదారిలో ఉంద‌ని ఆయ‌న విశ్లేషించారు.

యూట్యూబ్ చానెల్ ఇంట‌ర్వ్యూలో జ‌య ప్ర‌కాష్ నారాయ‌ణ్ మాట్లాడుతూ-``యువ‌త‌ను అంద‌రినీ కోరుతున్నాను. ఇలాంటి పిచ్చి ఆలోచ‌న పెట్టుకోకండి. ఆ సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలీదు. స్కిప్టు ర‌చ‌యిత ఎవ‌రో తెలీదు. అలాంటి మూర్ఖులు ఇలాంటి పిచ్చి భావాల‌ను.. అప్ర‌జాస్వామిక‌, బానిస‌త్వ భావాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డాన్ని క్ష‌మించ‌లేనివి`` అని వ్యాఖ్యానించారు.

``ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్ర‌తినిధుల‌ను గౌర‌వించ‌క‌పోతే, ప్ర‌జా తీర్పును గౌర‌వించ‌క‌పోతే ఎలా? ఓటు అంటే ఆషామాషీ అనుకున్నారా? ప్ర‌తినిధులు త‌ప్పులు చేస్తే `జీ హుజూర్` అని కాళ్లు ప‌ట్టుకోమ‌ని ఎవ‌రూ అన‌డం లేదు. కానీ ప్ర‌జా ప్ర‌తినిధికి, చ‌ట్ట‌స‌భ‌ల‌కు, ప్ర‌జాస్వామ్యానికి గౌర‌వం ఇవ్వ‌కుండా... నువ్వు ఐదేళ్లు ఉంటావ్ పోతావ్.. నేను ముప్పై ఏళ్లు ఉంటాను.. అన‌డం ఎంత అహంకారం?`` అని జేపీ ప్ర‌శ్నించారు. ఒక‌వైపు కోపం.. బాధ క‌లిగాయి... అని అన్నారు.

ఒక మంత్రి గారు.. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు .. తర్వాత అన్యాయంగా న‌క్స‌లైట్లు పొట్ట‌న పెట్టుకున్న నాయ‌కుడి గురించి జేపీ ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. ``స‌ర్.. నేను ప్ర‌జ‌లు ఎన్నుకోక‌పోతే బ‌య‌ట‌కు పోతాను..`` అని మంత్రి గారు అన్నారు. అప్ప‌టికి నేను చాలా చిన్న‌వాడిని.., ట్రైనింగ్ లో ఉన్న నేను `స‌ర్` అని పిల‌వొద్దు.. మీరు చాలా పెద్ద‌వారు అని అన్నాను. ఆయ‌న మంత్రి హోదాలో ఉన్నారు.. పైగా పెద్ద వ్య‌క్తి.. ఎంతో గౌర‌వంగా ఒక అధికారితో మాట్లాడార‌ని అన్నారు. ప్ర‌జా ప్ర‌తినిధులు గౌర‌వం ఇచ్చి పుచ్చుకుంటార‌ని గుర్తు చేసారు.

దేశాన్ని నిజంగా ప్రేమిస్తే, ప్ర‌జాస్వామ్యాన్ని గౌర‌విస్తే.. ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను అలాంటి మాట అంటారా? ప్ర‌జాస్వామ్యాన్ని గౌర‌వించ‌క‌పోతే.. ఒక‌రోజు ప‌రీక్ష పాసైన అధికారికి ఇంత అహంకార‌మా? ఆరోజు నీకు అదృష్టం ఉండొచ్చు. చ‌దువుకున్న‌వాడిగా గొప్ప‌వాడివి కావొచ్చు. అంత మాత్రాన ఇంత అహంకార‌మా? అని కూడా గేమ్ ఛేంజ‌ర్ లో రామ్ చ‌ర‌ణ్ పాత్ర‌పై విమ‌ర్శ‌లు కురిపించారు.

జేపీగా సుప్ర‌సిద్ధులైన నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన మజీ ఐ.ఎ.ఎస్ అధికారి, రాజకీయవేత్త గా సుప‌రిచితులు. ఆయ‌న `లోక్ సత్తా` పార్టీ వ్యవస్థాపకుడు అన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌జాస్వామ్యం, రాజ‌కీయ‌, ఆర్థిక‌, సామాజిక స‌మ‌స్య‌ల‌పై జేపీ లోతైన విశ్లేష‌ణ‌లు అంద‌రి హృద‌యాల‌ను గెలుచుకుంటాయి.

Full View
Tags:    

Similar News