'సర్దార్ 2' అప్డేట్.. కార్తీ నట విశ్వరూపం!
బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సర్దార్ కు సీక్వెల్ గా వస్తున్న ఆ సినిమాకు పీ ఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.;

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం సర్దార్ 2 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సర్దార్ కు సీక్వెల్ గా వస్తున్న ఆ సినిమాకు పీ ఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత ఎస్. లక్ష్మణ్ కుమార్ భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే సర్దార్-2 పై భారీ బజ్ క్రియేట్ అయింది.
రీసెంట్ గా మేకర్స్.. సినిమా నుంచి కార్తీ ఫస్ట్ లుక్ తో పాటు ప్రోలాగ్ వీడియోను సోమవారం రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ అదిరిపోగా.. సీక్రెట్ ఏజెంట్ గా కార్తీ సినిమాలో కనిపించనున్నారని క్లియర్ గా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రోలాగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మూవీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
అయితే వేరే లెవెల్ ఫైట్ సీక్వెన్స్ తో ప్రోలాగ్ వీడియో స్టార్ట్ అవ్వగా.. సర్దార్ పై దాడి చేసేందుకు కొందరు వస్తారు. అప్పుడు దేశం ప్రమాదంలో ఉందని గ్రహిస్తాడు. ఆ తర్వాత బ్లాక్ డాగ్గర్ ప్రళయం క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తున్నాడని చెబుతాడు. పోరాడేందుకు సిద్ధపడతాడు. కోలీవుడ్ స్టార్ నటుడు ఎస్ జే సూర్య నెగిటివ్ రోల్ లో కనిపిస్తారు.
అసలు దేశాన్ని నాశనం చేసేందుకు ఎస్ జే సూర్య ఏం చేశాడు? కార్తీ దాన్ని ఎలా ఛేజ్ చేశాడు? అన్నది సినిమాగా తెలుస్తోంది. మొత్తానికి ప్రోలాగ్ వీడియోలోని కార్తీ డైలాగ్స్.. మూవీపై మంచి అంచనాలు నెలకొల్పాయి. ఆయన గెటప్ అండ్ యాక్టింగ్.. అదిరిపోయిందని నెటిజన్లు, మూవీ లవర్స్ కొనియాడుతున్నారు.
కార్తీ నట విశ్వరూపం అని కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమా విషయానికొస్తే.. ఆషిక రంగనాథ్, మాళవిక మోహనన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఎస్ జే సూర్య విలన్ గా కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు.
ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే రిలీజ్ కానుంది. అయితే 2022లో రిలీజ్ అయిన సర్దార్ భారీ విజయం సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు అంతకు మించి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి సర్దార్ 2 ఎలా ఉంటుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.