ఇండస్ట్రీ తీరుపై చిర్రెత్తిపోయిన హాట్ లేడీ!
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ పై ఈ రకమైన ఆరోపణలు కొత్తేం కాదు. గతంలో చాలా మంది హీరోయిన్లు ఇలాంటి ఆరోపణలు చేసారు.;

బాలీవుడ్ నటి రిచా చద్దా చిత్ర పరిశ్రమపై సంచలనం వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం లేదని..వాళ్లలో వాళ్లకే ఛాన్సులిస్తున్నారని మండిపడింది. స్టార్ హీరో సినిమా ప్లాప్ అయితే అందరూ జాగ్రత్త పడతారు. తర్వాత ఎలా పనిచేయాలని ఆలోచన చేసుకుంటారు. అదే కొత్త వాళ్లకు రాకారాక ఒక ఛాన్స్ వచ్చి ఫెయిలైతే? వాళ్లు ఇంటికెళ్లాల్సిన పరిస్థితులు దాపరిస్తున్నాయి.
ఈ విషయంలో బాలీవుడ్ సౌత్ ఇండస్ట్రీలను చూసి నేర్చుకోవాలని సూచించింది. ఓ సినిమా పోయినా మరో సినిమాలో అవకాశం కల్పించడం అన్నది వాళ్లకే చెల్లింది. ఇలాగైతే బాలీవుడ్ లో కొత్త వాళ్లు ఎలా రాణించగలరని ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ పై ఈ రకమైన ఆరోపణలు కొత్తేం కాదు. గతంలో చాలా మంది హీరోయిన్లు ఇలాంటి ఆరోపణలు చేసారు.
అలాగే బాలీవుడ్ లో లైంగిక వేధింపులు ఇష్టాను సారం జరుగుతున్నాయని..కాస్టింగ్ కౌచ్ లో భాగంగా వీటిని ప్రతీ మహిళ ఎదుర్కోవాల్సి ఉంటుందని గతంలో చాలా మంది నటీమణులు ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే సౌత్ సినిమాల సక్సెస్ ను చూసి బాలీవుడ్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని అమితా బచ్చన్, అమీర్ ఖాన్ లాంటి దిగ్గజాలు కౌంటర్ వేసిన సంగతి తెలిసిందే.
వరుసగా తెలుగు సినిమాలు పాన్ ఇండియాలో సత్తా చాటడంతో బాలీవుడ్ రేసులో వెనుకబడింది. చేసిన ప్రయత్నాలేవి కలిసి రావడం లేదు. నష్టాలు తప్ప లాభాలు తేవడం లేదు. ఈ క్రమంలోనే కొందరు హిందీ దర్శకులు సౌత్ కి వెళ్లి మేకింగ్ విధానం నేర్చుకోవాలంటూ అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.