మాస్ సాంగ్ తో నందమూరి హీరో..!
ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించారు.;

నందమూరి హీరో కళ్యాణ్ రాం నటిస్తున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా నుంచి చుక్కల చీర కట్టేసి సాంగ్ రిలీజైంది. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించారు. ఈమధ్యనే రిలీజైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో విజయశాంతి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.

ఇక ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా చుక్కల చీర అంటూ ఒక మాస్ సాంగ్ రిలీజ్ చేశారు. సినిమాకు అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మాస్ సినిమాకు సాంగ్ తో ఇంకాస్త మాస్ అప్పీల్ వచ్చేలా చేశారు. ఈ సాంగ్ లో కళ్యాణ్ రామ్ లుక్, డ్యాన్స్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇక అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఒక తల్లి కొడుకుల కథగా వస్తుంది.
కళ్యాణ్ రామ్ తన ప్రతి సినిమాతో కొత్త అటెంప్ట్ చేస్తుంటాడు. ఫలితాలతో సంబంధం లేకుండా అతని ప్రయత్నాలు ఉంటాయి. అందులో భాగంగానే ఒక మంచి మాస్ యాక్షన్ కథ విత్ ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో వస్తున్నాడు. సినిమా పట్ల కళ్యాణ్ రామ్ కు ఉన్న అంకితభావం ఏంటన్నది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. అర్జున్ సన్నాఫ్ విజయంతి సినిమా విషయంలో కూడా కళ్యాణ్ రామ్ చాలా కమిటెడ్ గా పనిచేస్తున్నారని తెలుస్తుంది.
ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్ టీ ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ముప్ప అశోక్ వర్ధన్, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఐతే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా డిక్లేర్ చేయలేదు. కళ్యాణ్ రామ్ ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది. సినిమా నుంచి ప్రమోషనల్ కంటెంట్ కూడా ఫ్యాన్స్ ను మెప్పిస్తుంది కాబట్టి అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ అందుకుంటాడేమో చూడాలి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా కళ్యాణ్ రామ్ ప్రతి సినిమాకు చాలా కష్టపడుతుంటాడు. ఈ సినిమాలో కూడా యాక్షన్ పార్ట్ కోసం రిస్కీ సీన్స్ చేశారని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో ఆఫ్టర్ లాంగ్ టైం విజయశాంతి ఫైట్స్ కూడా ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తాయని అంటున్నారు.