ప్రభాస్‌కు ఇలాంటివి చాలా రొటీన్: అమితాబ్

ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఈ సినిమా సక్సెస్ గురించి ప్రభాస్ కు ఇలాంటి విజయాలు రొటీన్ గా మారిపోయాయి అంటూ రెబల్ స్టార్ బాక్సాఫీస్ స్టామినా గురించి చెప్పకనే చెప్పారు.

Update: 2024-07-17 12:47 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. ఇందులో అమితాబ్‌ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే వంటి స్టార్ యాక్టర్స్ భాగమయ్యారు. బాక్సాఫీస్ వద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం.. ₹1050 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న చిత్ర బృందం.. ఒక్కరొక్కరుగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా అమితాబ్ వీడియో రూపంలో అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

'కల్కి' సినిమా విజయంలో భాగమైన వారందరికీ ధన్యవాదాలు చెప్పిన అమితాబ్ బచ్చన్.. 1000 కోట్ల కలెక్షన్స్ కంటే ప్రేక్షకుల ప్రశంసలు, ప్రేమ ఎంతో విలువైనవని అన్నారు. ఇదంతా దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్, నిర్మాతలు అశ్వినీ దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ ల నమ్మకం వల్లనే సాధ్యమైందని చెబుతూనే.. సినిమా సక్సెస్ లో ప్రతి ఒక్కరికీ భాగం ఉందని చెప్పారు. తన కోస్టార్స్ కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకునేల నటనను మెచ్చుకున్నారు. ఈ సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన నటీనటులు, సాంకేతికత నిపుణుల కృషిని అభినందించారు.

ప్రభాస్ కు 1000 కోట్ల వసూళ్లు కొత్తమీ కాదని, కానీ తనకు మాత్రం ఇలాంటి గొప్ప చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు అమితాబ్. "ప్రభాస్ కు ఇలాంటి సక్సెస్ లు రొటీన్ గా మారిపోయాయి. ఇటీవల కాలంలో ఆయన నటించిన చాలా సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరాయి. నాకు మాత్రం కల్కి లాంటి అతి పెద్ద కాన్సెప్ట్ లో భాగమైనందుకు చాలా ఆనందంగా గౌరవంగా ఉంది" అని బిగ్ బీ తెలిపారు. 'కల్కి' పార్ట్-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.

"నేను ఈ చిత్రాన్ని ఎంతగా ఎంజాయ్‌ చేశానో మాటల్లో చెప్పలేను. ఆల్రెడీ నాలుగుసార్లు సినిమా చూశాను. కొందరు గెస్టులతో కలిసి ఐమాక్స్ లో చూశాను. ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూనే ఉన్నాను. నా వరకూ ఇది ఒక యాక్టర్ జాబ్ అని నేను అనుకోవడం లేదు. నాకు ఇది ఒక గ్రేట్ ఎడ్యుకేషన్. మన కల్చర్, ఇండియన్ మైథాలజీని డైరెక్టర్ నాగి ఎంతో అద్భుతంగా ఒక సినిమాగా తెర మీద ఆవిష్కరించారు" అని అమితాబ్ చెప్పుకొచ్చారు.

ఇటీవల ప్రభాస్, కమల్ హాసన్ సైతం 'కల్కి 2898 AD' విజయంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. సినిమాకు ఎన్ని కోట్లు వసూళ్లు వచ్చాయనేది ముఖ్యం కాదని, అదిచ్చిన సంతృప్తి చాలా ముఖ్యమని కమల్ అన్నారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఈ సినిమా సక్సెస్ గురించి ప్రభాస్ కు ఇలాంటి విజయాలు రొటీన్ గా మారిపోయాయి అంటూ రెబల్ స్టార్ బాక్సాఫీస్ స్టామినా గురించి చెప్పకనే చెప్పారు.

'కల్కి 2898 AD' సినిమాలో బౌంటీ హంటర్ భైరవగా, కర్ణుడిగా రెండు పాత్రల్లో కనిపించారు ప్రభాస్. అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాస్కిన్‌గా కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషించారు. దీపికా పదుకునే, దిశా పటానీ కథానాయికలుగా నటించారు. అర్జునుడుగా విజయ్‌ దేవరకొండ కనిపించగా.. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్, ఎస్.ఎస్. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ అతిథి పాత్రల్లో మెరిశారు.

Full View
Tags:    

Similar News