అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. బిజినెస్ లో స్ట్రాంగ్ గానే..

ఇక బిజినెస్ విషయానికి వస్తే, ఈ సినిమాకు థియేట్రికల్ హక్కుల పరంగా మంచి రెస్పాన్స్ వచ్చింది.;

Update: 2025-04-07 10:47 GMT
Arjun Son Of Vyjaynthi Business

నందమూరి కళ్యాణ్ రామ్ మరోసారి మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్‌లో 21వ సినిమా కాగా, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై నందమూరి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి.

ఇటీవలి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమా పై పాజిటివ్ బజ్ నెలకొంది. గ్రామీణ నేపథ్యంలో మాస్ యాక్షన్ ప్యాకేజ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి తన మార్క్ చూపించనున్నాడు. అశోక్ క్రియేషన్స్ బ్యానర్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. అలాగే టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లేడి సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాలో హీరోకి తల్లి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. కత్తి పట్టిన ఓ ధీరునిగా కళ్యాణ్ రామ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇక బిజినెస్ విషయానికి వస్తే, ఈ సినిమాకు థియేట్రికల్ హక్కుల పరంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన హక్కులు రూ.12 కోట్లు పలికాయి. ఈ లెక్కన చిత్రానికి అక్కడ మంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో సీడెడ్ (రాయలసీమ) హక్కులు రూ.3.70 కోట్లకు డీల్ క్లోజ్ కావడం గమనార్హం.

తాజాగా నైజాం రైట్స్ కూడా డీల్ క్లోజ్ అయ్యింది. ఈ హక్కులను ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. మైత్రి చేతిలో ఉండటం వల్ల నైజాంలో విడుదల మరింత బలంగా ఉండబోతోంది. ఈ స్థాయిలో రైట్స్ అమ్ముడుపోవడం, కళ్యాణ్ రామ్ మార్కెట్‌కు మరింత బలాన్ని చేకూర్చే అంశంగా పరిశీలించవచ్చు. భారీ ప్రమోషన్స్‌తో విడుదలకు ముందు సినిమాపై హైప్ పెరిగే అవకాశముంది.

ఈ నెల 12న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరవుతున్నట్లు సమాచారం. దీనివల్ల సినిమా మీద మరింత ఫోకస్ వచ్చే అవకాశం ఉంది. సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీకాంత్, సోహెల్ ఖాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 18న విడుదలవుతున్న ఈ మూవీ కేవలం నందమూరి ఫ్యాన్స్‌కి కాదు, మాస్ ఆడియెన్స్‌కు కూడా ఓ ఫుల్ మీల్స్ ఎంటర్‌టైనర్‌గా నిలవబోతోంది. మరి ఈ సినిమా.బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News