2022 రివ్యూ: ది బెస్ట్ పార్టీ సాంగ్స్ ఇవే

Update: 2022-12-31 10:33 GMT
2022 ఆద్యంతం బాలీవుడ్ ప‌రాజ‌యాల బాట‌లో ఉన్నా కానీ ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా ఘ‌న‌విజ‌యంతో కొంత‌ ఊర‌ట ద‌క్కింది. క‌న్న‌డ రంగం నుంచి 'కేజీఎఫ్ 2' ఈ ఏడాది మ‌రో సంచ‌ల‌నం. కశ్మీర్ ఫైల్స్- భూల్ భుల‌యా 2 లాంటి చిత్రాల విజ‌యం హిందీ పరిశ్ర‌మ‌కు కొంత ఊర‌ట‌. ఈ ఏడాది ప‌రిశ్ర‌మ‌లో ఎక్కువ హిట్ చిత్రాలను చూసి ఉండకపోవచ్చు కానీ .. పార్టీ మూడ్ కి తగిన కొన్ని సూపర్ హిట్ డ్యాన్స్ నంబర్ లకు అయితే కొద‌వేమీ లేదు. ఈ నూతన సంవత్సర వేడుకల కోసం..31 మిడ్ నైట్ మ‌సాలా కోసం డీజే క్రౌడ్స్  ఎక్కువ‌గా షేర్ చేసుకున్న పార్టీ సాంగ్స్ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

RRR నుంచి నాటు నాటు (నాచో నాచో)... పఠాన్ నుంచి బేషరమ్ రంగ్ .. గంగూబాయి కతియావాడి నుంచి ధోలిడా ఈ సంవత్సరపు ది బెస్ట్ పార్టీ సాంగ్స్ జాబితాలో ఉన్నాయి. ప్రాంతీయ భాష‌ల నుంచి వ‌చ్చి ఉత్త‌రాదినా ఊహించని బ్లాక్ బస్టర్ లు అందుకున్నాయి ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ 2 చిత్రాలు. ఈ సినిమాల్లో పార్టీ సాంగ్స్ ఇన్ స్టంట్ హిట్స్.

బాలీవుడ్ కి ఒక‌టో అరో హిట్లు ఉన్నా కానీ.. భారీ-బడ్జెట్ సినిమాలు చాలా వ‌ర‌కూ ఫ్లాప్ లను చ‌వి చూశాయి. ఎట్ట‌కేల‌కు 2022 సంవత్సరం ముగిసింది. బాక్సాఫీస్ వద్ద హిట్టు లేదా ఫ్లాప్ తో ఎలాంటి సంబంధం లేకుండా ప‌లు 'హిట్ పార్టీ సాంగ్స్ ' వెండితెర య‌వ‌నిక‌పై సందడి చేశారు.

పఠాన్ పాట బేషరమ్ రంగ్ డిసెంబరులో లాంచ్ కాగా ఇది పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. వివాదాల‌తో ప‌ఠాన్ కి బోలెడంత ప్ర‌చారం తెచ్చి పెట్టింది ఈ గీతం. పార్టీ సాంగ్ లో దీపికా పదుకొణె గ్లామ‌ర‌స్ ట్రీట్ ని యువ‌త‌రం ఇప్ప‌ట్లో మ‌ర్చిపోలేదు. దీపిక‌-  షారూఖ్ ఖాన్ ల స్పెష‌ల్ నంబర్ బేష‌ర‌మ్ చుట్టూ ఉన్న వివాదం  తక్షణ ప్రజాదరణను అడ్డుకోలేకపోయింది. ఇది మూడు వారాల్లో యూట్యూబ్ లో 144 మిలియన్లకు పైగా వీక్షణలను సాధించింది. ఈ చిత్రంలోని రెండవ పాట ఝూమే జో పఠాన్ కూడా చ‌క్క‌ని ఆద‌ర‌ణ‌తో దూసుకుపోతోంది.

RRR నాచో నాచో (తెలుగులో నాటు నాటు) .. సంజయ్ లీలా భన్సాలీ -గంగూబాయి కతియావాడి నుండి అలియా భట్ గర్బా పాట ధోలిడా చ‌క్క‌ని పార్టీ సాంగ్స్ గా రికార్డుల‌కెక్కాయి. రామ్ చరణ్- జూ.ఎన్టీఆర్ నాటు నాటు పాటలో ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ ఇంచుమించు స‌మానమైన‌ డ్యాన్స్ కదలికలతో అల‌రించిన తీరు అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్స్ లో షార్ట్ లిస్ట్ కి వెళ్లింది ఈ పాట‌. వరుణ్ ధావన్ - కృతి సనన్ జంట‌గా న‌టించిన‌ భేదియా పాట 'తుమ్కేశ్వరి..' అంద‌మైన హుక్ స్టెప్ తో కూడా డ్యాన్స్ ఫ్లోర్ పై అద‌ర‌గొట్టింది.

రణ్ వీర్ సింగ్ చిత్రం జయేష్ భాయ్ జోర్దార్ బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైంది. ఈ మూవీ ఎక్కువ రోజులు ఆడ‌లేదు కానీ ప్రమోషనల్ సాంగ్ ఫైర్ క్రాకర్ తక్షణమే హిట్ అయ్యింది. కొన్ని పెప్పీ ఇంగ్లీష్ లిరిక్స్ తో కూడిన ఈ పాట రణవీర్ గుజరాతీ తండ్రి పాత్రకు అద‌న‌పు బూస్ట్ నిచ్చింది. ర‌ణ‌వీర్ న‌టించిన తాజా బాక్సాఫీస్ ఫ్లాప్ 'సర్కస్' నుండి దీపికా పదుకొణెతో అతని తాజా డ్యాన్స్ నంబర్ కరెంట్ లాగా ఏడాది ముగింపులో హిట్ పార్టీ నంబర్ ల జాబితాలో చేరింది.

అదేవిధంగా విజయ్ దేవరకొండ- అనన్య పాండే జంట‌గా న‌టించిన లైగ‌ర్ డిజాస్ట‌రైనా కానీ ఈ చిత్రం నుండి ఆఫత్ పాట మ్యూజిక్ చార్ట్స్ లో అగ్రస్థానంలో ఉంది. ఈ పాట కేవలం ట్రిప్పీ.. ఫుట్ ట్యాపింగ్ నంబర్ మాత్రమే కాదు.. గ‌మ్మ‌త్త‌యిన విదేశీ బీచ్ లొకేష‌న్ల‌లో అద్భుత‌మైన షాట్స్ తో తెర‌కెక్కింది. గోవా బీచ్ లో షూట్ చేసిన తర్వాత VFX తో విదేశీ బీచ్ అన్న ఫీల్ ని పూరి ర‌ప్పించార‌ని స‌మాచారం.

సిద్ధార్థ్ మల్హోత్రా-నటించిన 'థ్యాంక్ గాడ్' ప‌రాజ‌యం పాలైనా దీని నుండి మానికే పాట గొప్ప ఓదార్పు. సినిమా ఫ్లాపైనా కానీ మానికే మాగే పాట ఇన్ స్టంట్ హిట్ అయింది. ఈ స్లో పార్టీ నంబర్ ను జుబిన్ నౌటియాల్- సూర్య రఘునాథన్ లతో కలిసి యోహాని మళ్లీ పాడారు. నేటిత‌రం రీమిక్స్ ల రారాజు తనిష్క్ బాగ్చి సంగీతం అందించారు. భూల్ భూలయ్యా 2 టైటిల్ ట్రాక్ కూడా 2007 ఒరిజినల్ మూవీకి పునర్నిర్మించిన వెర్షన్ అయినప్పటికీ భారీ విజయాన్ని సాధించింది. దీనికి తనిష్క్ సంగీతం అందించారు.

మ‌ల్టీ-స్టారర్ ఫ్యామిలీ డ్రామా 'జగ్ జగ్ జీయో'లోని పంజాబాన్ సాంగ్ మరొకసారి రీక్రియేట్ చేసిన‌దే. ఈ సంవత్సరం అత్యంత విస్తృతంగా ప్లే అయిన పాటల్లో ఇది ఒకటిగా నిలిచింది.  అనిల్ కపూర్- నీతూ కపూర్- కియారా అద్వానీ -వరుణ్ ధావన్ తదిత‌ర‌ సహతారాగణం ఇందులో క‌నిపించారు. పాకిస్తానీ గాయకుడు అబ్రార్ ఉల్ హక్ తన హిట్ పాకిస్తానీ నంబర్ పార్టీ పాట‌లో ఉచ్ఛార‌ణ‌ను తప్పుగా ప‌ల‌క‌డంపై వివాదం త‌లెత్తింది. కానీ ఆ పాట జ‌నంలో కావాల్సినంత క్యూరియాసిటీని పెంచింది.

పార్టీలలో విస్తృతంగా వినిపించే మరో పాకిస్తానీ పాట పసూరి. అలీ సేథి -షే గిల్ ల ఒరిజినల్ పాట 'BTS బటర్' (సాంగ్‌) ను అధిగమించి ఈ సంవత్సరం ప్రపంచంలో అత్యధికంగా గూగుల్ లో సెర్చ్ చేసిన పాటగా నిలిచింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ పాటపై తమ ప్రేమను కురిపించ‌గా.. గాయకుడు అర్జిత్ సింగ్ నవంబర్ లో ముంబైలో త‌న‌ సంగీత కచేరీలో ఈ పాట‌ను ప్రదర్శించడం ఆస‌క్తిక‌రం.

నోరా ఫతేహి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నృత్యకారిణిగా ఘ‌నుతికెక్కింది. మణికేతో పాటు గురు రంధవా ఆల‌పించిన‌ 'సింగిల్ డాన్స్ మేరీ రాణి'లో కూడా నర్తించింది. పాటలో అది షకీరా కాదు నోరా అని గుర్తించడానికి వీక్షకులు దగ్గరగా చూడాలి.  ఇలా చాలా పార్టీ సాంగ్స్ ఏడాది ఆద్యంతం చార్ట్ బ‌స్ట‌ర్ల‌లో నిలిచాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News