సంక్రాంతి పండగ సందడి అయిపొయింది. ఈ పండగ బరిలో ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ కాగా అన్ని కూడా ఎవరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. బ్లాక్ బస్టర్ అని గట్టిగా చెప్పుకునేంత సినిమా అయితే ఏదీ కూడా లేదు. కమర్షియల్ గా మాత్రం అన్ని సినిమాలు ప్రేక్షకులని మెప్పించాయి. ఈ నేపధ్యంలో కమర్షియల్ సక్సెస్ అనే ట్యాగ్ వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తెగింపు సినిమాలకి సరిపోతుంది.
మళ్ళీ ఈ నెలలోనే మరోసారి సినిమా సందడి మొదలు కాబోతుంది. వచ్చే వారం ఏకంగా తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ తెలుగు వెర్షన్ కూడా ఒకటి కావడం విశేషం. షారుఖ్ ఖాన్ సినిమాలకి సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. నార్త్ లో హేట్ చేసినట్లు సౌత్ లో షారుఖ్ ని ద్వేషించరు.
సినిమాని సినిమాలా చూసే కల్చర్ సౌత్ లో ఉండటంతో బాలీవుడ్ ఖాన్ ల సినిమాలకి తెలుగులో భాగానే ఓపెనింగ్స్ వస్తాయి. గతంలో షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా సౌత్ లో కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. హిందీ వెర్షన్ లోనే సౌత్ లో కూడా రిలీజ్ అయిన మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా కల్చర్ కనిపిస్తూ ఉండటంతో బాలీవుడ్ సినిమాలని తెలుగు డబ్ చేసి అన్ని భాషలలో ఒకే సారి రిలీజ్ చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో పఠాన్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో ఈ నెల 25న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం షారుఖ్ హైదరాబాద్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దీనితో పాటు సుదీర్ బాబు హంట్ మూవీ జనవరి 26న రిలీజ్ కాబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై సుదీర్ బాబు భాగా హోప్స్ పెట్టుకున్నాడు.
అలాగే తుపాకుల గూడెం అనే చిన్న సినిమా జనవరి 26న రిలీజ్ కాబోతుంది. దీంతో పాటు సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన చిన్న సినిమా బుట్టబొమ్మ మూవీ కూడా జనవరి 26న రిలీజ్ కాబోతుంది. మలయాళంలో హిట్ అయిన కప్పెల మూవీకి అఫీషియల్ రీమేక్ అనే సంగతి తెలిసిందే. లవ్ స్టొరీగా వస్తున్న ఈ సినిమాకి యూత్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీటితో పాటు బాలకృష్ణ అఖండ హిందీ వెర్షన్ జనవరి 20న నార్త్ ఇండియాలో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీపై అక్కడ గట్టిగానే బజ్ ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.