ప్రాజెక్ట్ -K హీరోయిన్ కి భయానక అనుభవం

Update: 2022-01-08 14:30 GMT
ప‌ద్మావ‌త్ గా దేవ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు అందుకుంది దీపిక ప‌దుకొనే. గ్లామ‌ర‌స్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న దీపిక నాయికా ప్ర‌ధాన పాత్ర‌ల‌తోనూ సంచ‌ల‌నాలు సృష్టించ‌గ‌ల‌ద‌ని ప్రూవ్ చేసింది.

దీపికా పదుకొణే దేశంలోనే అగ్ర నాయిక‌గా హోదాను ఆస్వాధిస్తూనే ఇప్పుడు నిర్మాత‌గానూ తొలి అడుగులు వేస్తోంది. ఇటీవ‌లే దీపిక న‌టించి నిర్మించిన 83 రిజ‌ల్ట్ నిరాశ‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ప్ర‌భాస్ స‌ర‌స‌న ప్రాజెక్ట్ - కే తోనూ దీపిక బిజీగా ఉంది.

ఇంత‌కుముందు రెండవ వేవ్ సమయంలో కోవిడ్ 19 పాజిటివ్ రావ‌డంతో దీపిక స్వీయ‌నిర్భంధంలోకి వెళ్లింద‌ట‌. కానీ ఆ విష‌యం ఆల‌స్యంగా వెల్ల‌డించింది. తొలిసారిగా ఆమె ఇప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దీపిక.. త‌న‌కు ఇచ్చిన స్టెరాయిడ్స్ వల్లే తనను గుర్తుపట్టలేనంత‌గా చేశారన్నారు. కాబట్టి కోవిడ్ విచిత్రంగా ఉంది.. మీ శరీరంలో భిన్నంగా అనిపిస్తుంది.. మీ మనస్సు భిన్నంగా అనిపిస్తుంది.. అని దీపిక అన్నారు. ఆ అనుభ‌వం త‌న‌కు చాలా కొత్త‌గా ఉంద‌ని దీపిక త‌న మాట‌ల్లో వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే చిన్న షెడ్యూల్ ను పూర్తి చేసింది. నిర్మాతగా కూడా మారిన ఆమె హిందీలో మూడు చిత్రాలను నిర్మిస్తోంది. హృతిక్ రోష‌న్ స‌ర‌స‌నా దీపిక ఓ భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

హాలీవుడ్ చిత్రంలోనూ..!  

బాలీవుడ్ న‌టి  దీపికా ప‌దుకొణే `ట్రిపుల్ ఎక్స్` సిరీస్ తో హాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సిరీస్ దీపిక‌కి హాలీవుడ్ స‌హా అన్ని భాష‌ల్లోనూ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అప్ప‌టికే గ్లోబ‌ల్ స్టార్ గా వెలిగిపోతున్న ప్రియాంక చోప్రాతో పాటు దీపిక పేరు హాలీవుడ్ లో గ‌ట్టిగా మార్మోగింది. ప్ర‌స్తుతం దీపిక బాలీవుడ్ వ‌ర‌కూ ప‌రిమిత‌మైతే పీసీ మాత్రం  బాలీవుడ్ హాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. అయితే కొంత గ్యాప్ అనంత‌రం దీపికా తాజాగా మ‌రో హాలీవుడ్ చిత్రానికి ఎంపికైంది. రోమాంటిక్ కామెడీ జాన‌ర్ లో  ఓ సినిమా చేయ‌బోతుంది. ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.
Tags:    

Similar News