ప‌సుపులో తెలుగ‌మ్మాయ్ అంజ‌లి ధ‌గ‌ధ‌గ‌లు

Update: 2022-01-05 02:30 GMT
తెలుగమ్మాయి.. అందాల నాయిక‌ అంజ‌లి కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఈ భామ మూడు భాష‌ల్లో సినిమాల‌తో బిజీగా ఉంది. తెలుగు..త‌మిళ్..మ‌ల‌యాళంలో  బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. శంక‌ర్ తో పాన్ ఇండియా సినిమాలోనూ ఆఫ‌ర్ అందుకుంది. తెలుగు..త‌మిళ్..హిందీ భాష‌ల్లో తెరకెక్కుతున్న ఆర్.సి15లో అంజ‌లి ఓ ఆస‌క్తిక‌ర పాత్ర‌లో క‌నిపించ‌నుంది. మిగతా సినిమాల‌న్ని ప‌రిమిత బ‌డ్జెట్ లో తెర‌కెక్కేవి ఉన్నాయి. కొన్ని సినిమాలు ఆన్ సెట్స్ లో ఉండ‌గా మ‌రికొన్ని ఆలస్య‌మ‌వుతున్నాయి. మొత్తంగా అంజ‌లి అయితే తీరిక లేకుండా షూటింగ్ ల‌తో బిజీగా ఉంది. అందుకే ఈ బ్యూటీ ఇటీవ‌ల ఇన్ స్టాలో టైమ్ పాస్ యాక్టివిటీస్ జోలికి రావ‌డంలేదు.

కొవిడ్ ప్రారంభంలో కొన్ని ఫోటోషూట్ల‌తో అద‌రగొట్టిన అంజ‌లి మ‌ళ్లీ కొంత గ్యాప్ త‌ర్వాత ఇన్ స్టాలో ఫోటోల‌ను షేర్ చేస్తోంది. ప‌సుపు వ‌ర్ణం డిజైన‌ర్ డ్రెస్ ధ‌రించి అందాల్ని ఆవిష్క‌రిస్తూ కెమెరాకి ఫోజులిచ్చింది. గోల్డ్ క‌ల‌ర్ హెయిర్ ..  మ్యాచింగ్ బ్యాక్ గ్రౌండ్  క‌ల‌ర్ యాంబియెన్స్ తో   అంజ‌లి స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. అంజ‌లి చ‌ర్మంపై న‌ల్ల‌టి పుట్టుమ‌చ్చ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. చాలా రోజుల‌కి అంజ‌లి ట‌చ్ లోకి వ‌చ్చిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం అంజ‌లి సినిమాలు ఎక్కువగా త‌మిళ్ లోనే ఉండ‌టంతో చెన్నైలో నే నివ‌శిస్తోంది.. అవ‌స‌రం మేర హైద‌రాబాద్ ఇండ‌స్ట్రీతో అనుబంధం కొన‌సాగిస్తోంది. ఇటీవ‌ల‌ ఓ హీరోతో ల‌వ్ లో ప‌డింద‌ని..పెళ్లి చేసుకుంద‌ని కూడా ప్ర‌చారం సాగింది కానీ ఆ రిలేష‌న్ ఎంతో కాలం నిల‌బ‌డ‌లేదు. దీంతో  అంజ‌లి పూర్తిగా సినిమాల‌పైనే దృష్టి పెట్టి ప‌ని చేస్తోంది.  కెరీర్ ప‌రంగా పూర్తి బిజీగా గ‌డిపేయ‌డ‌మే త‌న క‌ల‌త‌ను మ‌రిపిస్తోంది.
Tags:    

Similar News