తాజాగా ట్రిపుల్ తలాక్ విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తలాక్.. తలాక్.. తలాక్.. అంటూ చెప్పేసి విడాకులు ఇచ్చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం నిర్ణయం తీసుకోవడంతో పాటు.. కొత్త చట్టాన్ని 45 రోజుల్లోగా తీసుకురావాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చింది. అయితే.. పక్కా ముస్లిం కంట్రీస్ గా పేరొందిన పలు దేశాల్లో 50 ఏళ్లకు పూర్వమే రద్దయిన ఈ విధానం.. ఇప్పటికైనా భారత్ లో అమలు కావడాన్ని ముస్లిం మహిళలు స్వాగతిస్తున్నారు.
ఇలా ట్రిపుల్ తలాక్ కారణంగా అనేక మంది మహిళలు.. హఠాత్తుగా ఒంటరి జీవులు అయిపోయారు. ఇలాంటి వారిలో ప్రముఖ బాలీవుడ్ మాజీ నటి అయిన మీనా కుమారి కూడా ఉన్నారనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. పాకీజా.. కాజల్.. బెనజీర్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న మీనా కుమారిని.. క్వీన్ ఆఫ్ ట్రాజెడీ అంటూ బాలీవుడ్ పిలుచుకుంటుంది. అయితే.. సినిమాల్లో మాదిరి కాకపోయినా.. ఈమె లైఫ్ కూడా ట్రాజెడీగానే క్లోజ్ అయింది.
1952లో దర్శకుడు కమల్ అమ్రోహిని వివాహమాడారు మీనా కుమారి. కానీ పెళ్లయిన కొంత కాలానికే వీరికి పొసగలేదు. దీంత మూడు సార్లు తలాక్ చెప్పి.. మీనాకుమారికి విడాకులు ఇచ్చేశారు ఆమె భర్త. ఆ తర్వాత చాలా కాలానికి మళ్లీ సయోధ్యకు ఇద్దరు సిద్ధమయ్యారనే వార్తలు వచ్చాయి కానీ.. అవేవీ కార్యరూపం దాల్చలేదు. చివరకు 1972లో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచేవరకూ.. మీనా కుమారిని ఈ విడాకుల వ్యవహారం వెంటాడుతూనే ఉందని అంటారు బాలీవుడ్ జనాలు.