"సంబరం"గా తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన బెంగళూరు భామ నిఖితకు ఈ నెల 9న పెళ్లైన సంగతి తెలిసిందే. అయితే ఆ పెళ్లి వేడుకకు సంబందించిన ఫోటో తాజాగా విడుదలయ్యింది. ఈ వేడుకకు సంబందించిన దుస్తుల్లో నిఖిత అదరహో అనిపించేలా ఉందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది. ముంబైకి చెందిన ఒక పారిశ్రామికవేత్త గన్దీప్ సింగ్ మాగోతో గత డిసెంబర్ లోనే ప్రేమలో పడింది నిఖిత. అయితే ప్రేమలో పడి ఏడాది గడిచేలోపే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
ఆఫ్ షోల్డర్ గౌను వేసుకుని - నిఖిత పెళ్లి డ్రెస్సులో అందరినీ అలరించింది. బ్లూ సూట్ లో గన్దీప్ కూడా మెరిసిపోయాడు. సినిమా పరిశ్రమకు చెందినవారి సందడి పెద్దగా కనిపించినట్లులేదుగానీ, వివాహం మాత్రం ఘనంగానే జరిగింది. ఈ మధ్య అడపాదడపా ఐటెమ్ సాంగ్స్ లోనూ, తక్కువ నిడివిగల ప్రత్యేక పాత్రల్లో నిఖిత కనిపిస్తూ ఉండేది. ఇకపై సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసినట్టే అని చెబుతున్నారు. ఏమో... పెళ్లి తరువాత ఆమెకి భారీ ఆఫర్లు వస్తే మళ్లీ నటించే ఛాన్సులు ఉండొచ్చేమో!
కాగా, నితిన్ హీరోగా "సంబంరం" సినిమాతో హీరోయిన్ గా తెలుగులో ఓ మాదిరి గుర్తింపును సంపాదించుకుంది నిఖిత. కానీ, ఆ తరువాత చెప్పుకోదగ్గ స్థాయిలో ఆమెకి అవకాశాలు రాలేదు. హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసినా కథల ఎంపికలో తడబాటు వల్ల హిట్ చిత్రాల్లో నటించలేకపోయింది. చివరికి చిన్నచిన్న పాత్రలూ కొన్నాళ్లపాటు చేసింది. తర్వాతి కాలంలో ఐటమ్ సాంగ్స్ లోనూ నటించింది. అయితే ప్రస్తుతం లైఫ్ లో సెటిల్ అయిపోదామని నిర్ణయించుకుందో ఏమో... ప్రేమించిన వ్యక్తినే పెళ్లిచేసుకుని ఇదిగో ఇలా చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది! ఆల్ ది బెస్ట్ నిఖిత!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/