తనవంతు ఆర్థికవిరాళం ప్రకటించిన ఐశ్వర్య!

Update: 2021-05-19 08:34 GMT
ప్రస్తుతం ఇండియాలో కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మారి పై పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా దేశంలో ఆర్థికవ్యవస్థకు చాలా నష్టం వాటిల్లింది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వాలకు అండగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు తమవంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సినీ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు తమకు తోచిన విరాళాలు ప్రకటించి మనసు చాటుకున్నారు. అదిగాక ప్రస్తుతం సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీకార్మికులకు సైతం ఇండస్ట్రీ వారు అండగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా సౌత్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.. తనవంతుగా తమిళనాడు ప్రభుత్వానికి లక్షరూపాయలు విరాళం ప్రకటించింది. అలాగే మరో లక్షరూపాయలు ఎఫ్ఈఎఫ్ఎస్ఐ యూనియన్ కు విరాళం అందించినట్లు సమాచారం. మరి ప్రస్తుతం పరిస్థితిలో ప్రతి ఒక్కరూ స్పందించి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉందని ఐశ్వర్య తెలిపిందట. ఈ విషయం పక్కనపెడితే.. ఐశ్వర్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మెల్లమెల్లగా సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. అందం గ్లామర్ అనే అంశాలు కాకుండా అభినయం పరంగా ఆకట్టుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతోంది ఐశ్వర్య.

ఐశ్వర్య ఆల్రెడీ తమిళంలో మంచి క్రేజ్ ఉన్నటువంటి హీరోయిన్. ఎక్కువగా పల్లెటూరి అమ్మాయిగా మోటు పాత్రలే చేస్తూ అలరించింది. ఇప్పుడు అవే అందాలతో తెలుగులో కూడా చక్రం తిప్పేస్తుంది. ప్రస్తుతం ఐశ్వర్య తెలుగులో కూడా బిజీ హీరోయిన్. ఆశ్చర్యం కలిగినా ఇదే నిజం. మరికొద్దికాలంలో అమ్మడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. ఎందుకంటే అమ్మడి చేతిలో ఇప్పుడైతే 8 సినిమాలున్నాయి. అందులో రిపబ్లిక్, టక్ జగదీష్, ఏకే రీమేక్ తెలుగు సినిమాలున్నాయి. మిగతావి తమిళం సినిమాలు. చూడాలి ఈ డస్కీ అందం టాలీవుడ్ లో స్టార్ అవుతుందేమో!
Tags:    

Similar News