చీరకట్టులో కూడా చిచ్చురేపుతోంది.. ఎవరీ వయ్యారి!

Update: 2021-04-24 11:59 GMT
దక్షిణాది చిత్రపరిశ్రమలో హీరోయిన్స్ పరంగా వారసత్వం అనేది తక్కువగా కనిపిస్తుంది. అదే బాలీవుడ్ ఇండస్ట్రీ అయితే దాదాపుగా సీనియర్ హీరోలు, హీరోయిన్స్ వారి కొడుకులు, కూతుళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేసేస్తారు. కానీ సౌత్ ఇండస్ట్రీలో అలా కాదు. ఎవరో ఒకరు మాత్రమే కూతురును హీరోయిన్ చేసే ఆలోచన చేస్తారు. ఆ విధంగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది తమిళ బ్యూటీ ఐశ్వర్యసార్జా. ఈ ఇరవై తొమ్మిదేళ్ల వయ్యారి ఎవరో కాదు.. స్టార్ యాక్షన్ కింగ్ అర్జున్ కూతురే ఐశ్వర్య. ఇండస్ట్రీకి అర్జున్ కూతురు అనే ట్యాగ్ లైన్ తో అరంగేట్రం చేసింది. ఇప్పటికి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 8ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటివరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేదు ఈ బ్యూటీ.

ఈ ఎనిమిదేళ్లలో ఐశ్వర్య చేసింది కేవలం మూడు సినిమాలే. 2013లో విశాల్ సరసన 'పట్టతు యానై' అనే సినిమాతో పరిచయమై తరువాత ఐదేళ్లకు 2018లో 'ప్రేమభరహా' చేసింది. అదే ఏడాది తమిళంలో "సొల్లివిడవ" అనే మూవీ ఐశ్వర్య లాస్ట్ మూవీ. అంతే ఈ మూడేళ్లలో అమ్మడి నుండి ఎలాంటి సినిమా రాలేదు. అలాగని న్యూ మూవీ చేస్తున్నట్లు కూడా ఇంతవరకు ఎవరికి క్లారిటీ లేదు. అయితే ఐశ్వర్యకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం స్టైలిష్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా అమ్మడు సారీలో పిక్స్ పోస్ట్ చేసింది. టాప్ టు బాటమ్ ఇంప్రెస్సివ్ బ్లూ సారీలో ఐశ్వర్య అందం మెరిసిపోతుంది. అలా బులుగు చీరలో కురులు జారవిడిచి అందమైన కుందనపు బొమ్మలా ముస్తాబై బాల్కనీలో ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం అలా అమ్మడి అందం చూస్తూ నేటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
Tags:    

Similar News