అక్కినేని యువహీరో అఖిల్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వంలో నితిన్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు దాదాపు ముగింపులో ఉన్నాయని సమాచారం. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని దసరా బరిలో వచ్చేయడమే అనుకుంటున్న టైమ్ లో ఇదో ట్విస్టు.
అఖిల్ దసరా రేసు లోకి దూసుకొస్తాడని దర్శకనిర్మాతలు అనుకున్నారు. అక్టోబర్ 21 రిలీజ్ తేదీ అని ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్ లో దసరాకి రిలీజ్ చేయడం కరెక్టు కాదని కింగ్ నాగార్జున భావిస్తున్నారట. దసరా రిలీజ్ కంటే డిసెంబర్ లో రిలీజ్ చేస్తేనే సెంటిమెంటు ప్రకారం వర్కవుటవుతుందని నాగ్ భావిస్తున్నారు. తన సినిమాలు మాస్, మన్మధుడు, కింగ్ డిసెంబర్ లోనే రిలీజై కాసుల వర్షం కురిపించాయి. తను నిర్మించిన ఉయ్యాల జంపాల కూడా డిసెంబర్ లోనే రిలీజై సక్సెసైంది. అందుకే అఖిల్ సినిమా కూడా అప్పుడు వస్తేనే కరెక్టని నాగార్జున భావిస్తున్నారు.
మరో కోణంలో ఆలోచిస్తే దసరా రేసులో ఓ అరడజను భారీ చిత్రాలు రిలీజవుతున్నాయి. చరణ్- శ్రీనువైట్ల 'మెరుపు' అక్టోబర్ 25న రిలీజవుతోంది. మరిన్ని చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. కాబట్టి వీటన్నిటి మధ్యా గుంపులో గోవిందంలా రిలీజ్ చేసేకంటే వేచి చూస్తేనే బెటరని నాగ్ భావిస్తున్నారట. ఇదే విషయాన్ని వినాయక్, నితిన్ లతోనూ ముచ్చటించారని అంటున్నారు. సెంటిమెంటు ప్రకారం వాయిదా వేస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.