అఖిల్ అక్కినేని నటించిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీసు దగ్గర నిరాశ పరిచిఉండొచ్చు గానీ దాంతో అఖిల్ ఇమేజ్ కి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఇప్పటికీ అఖిల్ కొత్త సినిమాపై అక్కినేని అభిమానులలో గానీ, ట్రేడ్ వర్గాలలో గానీ మంచి ఆసక్తే ఉంది. అఖిల్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జోరుగా సాగుతోంది. ఇంతలో అఖిల్ నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి ఒక కొత్త అప్డేట్ బయటకు వచ్చింది.
ఆది పినిసెట్టి సోదరుడైన సత్యప్రభాస్ దర్శకుడన్న విషయం తెలిసిందే. గతంలో అది హీరోగా 'మలుపు' సినిమాను డైరెక్ట్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. సత్య ప్రభాస్ ఈమధ్యనే అఖిల్ కు ఒక ఇంట్రెస్టింగ్ స్టొరీలైన్ వినిపించాడట. సత్య ప్రభాస్ స్టొరీ కి తెగ ఇంప్రెస్ అయిన అఖిల్ తనను ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేయమని సూచించాడట. ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్ కనుక అఖిల్ కి నచ్చితే ఈ సినిమానే అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్టు అవుతుంది.
అఖిల్ తన స్క్రిప్ట్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. రామ్ గోపాల్ వర్మ తో తన తదుపరి చిత్రం ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ 'ఆఫీసర్' చేసిన బాక్స్ ఆఫీస్ దాడితో మెల్లగా ఆ ప్రాజెక్ట్ ను సైడ్ లైన్ చేశాడు. అక్కినేని అభిమానులు కూడా దీంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అఖిల్ ఇలానే జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నారు.