అఖిల్ 15 నెలల తర్వాత..

Update: 2017-01-06 08:03 GMT
ఒక పెద్ద ఫ్యామిలీ వారసత్వంతో హీరోగా అరంగేట్రం చేశాక.. వరుసగా సినిమాలు చేసుకెళ్లిపోవడమే. తొలి సినిమాకు ముందు ప్రిపరేషన్‌ కు.. స్క్రిప్టు ఎంపికకు సమయం పడుతుంది కానీ.. ఆ తర్వాత నెమ్మదించడం ఉండదు. ఐతే అక్కినేని హీరో అఖిల్ విషయంలో అలా జరగలేదు. తొలి సినిమా కంటే కూడా రెండో సినిమా విషయంలో ఎక్కువ తర్జన భర్జనలు నడిచాయి. ఏడాదికి పైగా విరామం తీసుకుని రెండో సినిమా చేయాల్సి వచ్చింది. 2015 అక్టోబర్లో తన తొలి సినిమాను ఫినిష్ చేసిన అఖిల్.. 15న నెలల తర్వాత తన రెండో సినిమాను మొదలుపెడుతున్నాడు. అఖిల్ తన రెండో సినిమాగా విక్రమ్ కుమార్ కథను ఓకే చెప్పి కూడా నాలుగు నెలలవుతోంది. ఐతే స్క్రిప్టు తయారు చేయడంలో విక్రమ్ బాగా స్లో కావడంతో ఎదురు చూపులు తప్పలేదు.

ఇదిగో అదిగో అంటూనే 2016 దాటి వచ్చేశాడు అఖిల్. ఎట్టకేలకు కొత్త ఏడాదిలో సంక్రాంతి శుభ సందర్భాన ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనుంది. అన్నపూర్ణ స్టూడియో బేనర్లోనే ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇష్క్.. మనం.. 24 లాంటి మరపురాని సినిమాలతో తన స్టేచర్ బాగా పెంచుకున్న విక్రమ్.. మరో వైవిధ్యమైన కథతో రాబోతున్నాడు. ఈ స్క్రిప్టు గురించి ఈ మధ్య ట్విట్టర్లో చాలా ఎగ్జైట్ అయ్యాడు అఖిల్. తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న మలయాళ అమ్మాయి మేఘా ఆకాశ్ ఈ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం కానుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా వెంటనే మొదలుపెట్టి ఆరు నెలల్లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నాడు నాగార్జున. మరి ఈ సినిమాతో అయినా అఖిల్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News