చైసామ్ లు ద్వేషంలో ప్రేమ

Update: 2019-05-07 12:30 GMT
ఇప్పటి జెనరేషన్ లో టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే జంట నాగ చైతన్య సమంతాలదే. ప్రేక్షకులకు వీళ్ళ మీద అంత ప్రేమ ఉంది కాబట్టే మజిలీని పెద్ద హిట్ చేసి ఇచ్చారు. వీలున్నప్పుడంతా తమ ప్రేమ పెళ్లి కబుర్లు పంచుకునే ఈ జంటతో సినిమా తీయాలని వెయిట్ చేస్తున్న దర్శకుల లిస్ట్ పెద్దగానే ఉంది.

ఇటీవలే చైతు ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ లవ్ స్టోరీ కి సంబంధించిన కొన్ని షాకింగ్ స్వీట్ థింగ్స్ షేర్ చేసుకుని అభిమానులకు ట్విస్ట్ ఇచ్చాడు. వాటి ప్రకారం ఎనిమిదేళ్ల తమ ప్రేమ ప్రయాణంలో సామ్ తనను ఎక్కువగా ర్యాగింగ్ చేసిందట.నేను నీతో ప్రేమలో ఉన్నాను నీ కోసం వేచి చూశాను అని సమంత చెప్పే మాటల్లో నిజమెంతో తనకు తెలియదని ఎప్పుడు స్నేహితుల తరహాలోనే తమ మధ్య ఎక్కువ బంధం కొనసాగిందని చెప్పాడు.

తనను ద్వేషించి తర్వాత ప్రేమించి నేను కూడా అదే తరహాలో రెండూ చేసానని చెప్పి చైతు చిన్నపాటి షాక్ ఇచ్చాడు. పెళ్ళై ఏడాది అవుతున్నా ఇంకా చైతు సామ్ ల ప్రేమ కథలో బయటికి కనిపించని బోలెడు ట్విస్టులు ఉన్నాయన్న మాట. మజిలీ గ్రాండ్ సక్సెస్ తో చైతు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అందులోనూ భార్య జోడిగా నటించిన సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం కన్నా కావాల్సింది ఏముంటుంది
Tags:    

Similar News