నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'అక్షర' సినిమా కాన్సెప్ట్ టీజర్ ఈరోజే విడుదల చేశారు ఫిలిం మేకర్స్. షూటింగ్ ప్రారంభించడానికి ముందే తమ కాన్సెప్ట్ చెబుతూ టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. ఈ సినిమాకు దర్శకుడు ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథనందించిన పాపులర్ రైటర్ చిన్ని కృష్ణ.
ఇక కాన్సెప్ట్ పోస్టర్ విషయానికి వస్తే ఒక కాలేజిలో ఎవరో డబ్బుతో సీట్ కొనుక్కుంటారు. అప్పుడు "భారత దేశంలో ఎడ్యుకేషన్ అనేది ఓ గ్రోయింగ్ బిజినెస్" అంటూ ఓ క్యాప్షన్ చూపించారు. నెక్స్ట్ సీన్లో ఒక అమ్మాయికి సీట్ రానట్టు చూపించారు. ఆ తర్వాత "ప్రతి గంటకు ఇండియాలో ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటున్నాడు" అనే క్యాప్షన్ చూపించారు. నెక్స్ట్ షాట్ లో ఆ అమ్మాయి ఆ కాలేజీ బిల్డింగ్ పైనుండి దూకి తనువు చాలిస్తుంది. "నిజజీవిత సంఘటనల ఆధారంగా" అనే స్లైడ్ చూపించి హీరోయిన్ నందితా ను ఒక ఫిజిక్స్ లెక్చరర్ గా పరిచయం చేశారు.
ఫిజిక్స్ పుస్తకం పట్టుకుని స్టైల్ గా క్లాస్ రూమ్ లోకి నడుచుకుంటూ వచ్చి అక్కడ టేబుల్ పై బుక్కుని పెట్టి చాక్ పీస్ తీసుకుని బ్లాక్ బోర్డు పై అర్థంకాని ఫిజిక్స్ ఈక్వేషన్స్ వేస్తూ ఉంటుంది. అంతలో మెల్లగా గాలి వీచడంతో టేబుల్ పైనున్న బుక్ పేజీలు ఒక్కొక్కటి ఓపెన్ అయి అందులో ఫ్రెష్ రక్తం ఉన్న కత్తి బయట పడుతుంది. అంటే ఒకరు ఫసాక్ అన్నమాట!
మరి చనిపోయిన అమ్మాయే ఇలా వచ్చి తనకు అర్హత ఉన్న చదువుని దూరం చేసిన అందరిని చంపేస్తుందా లేదా.. కాలేజీ లెక్చరర్ విద్యావిధానం వ్యాపారంగా మారిన ఈ సిస్టం పై యుద్ధం ప్రకటించి జెంటిల్ మాన్ అర్జున్ లా అందరి వెంటబడుతుందా అంటూ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది ఈ కాన్సెప్ట్ టీజర్. థీమ్ మాత్రం ఇండియాలో ఇప్పుడొక బర్నింగ్ కాన్సెప్ట్. చిన్ని కృష్ణ ఎంచుకున్న కాన్సెప్ట్ మంచిదే. హీరోయిన్ సెలెక్షన్ కూడా బాగుంది. ఎలాగూ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' లో దెయ్యంగా దుమ్ము రేపింది కాబట్టి ఇప్పుడు ఇలాంటి థ్రిల్లింగ్ క్యారెక్టర్ తనకు కేక్ వాక్ లాంటిదే. ఓవరాల్ గా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ టీజర్.. హ్యావ్ ఎ లుక్ గైస్.
Full View