గ్యాపిచ్చిన సూర్య.. తిరిగి మొదలెట్టాడు

Update: 2018-04-11 05:54 GMT
సినిమా ప్రమోషన్స్ విషయంలో అల్లు అర్జున్ పక్కా ప్లానింగ్ తో ఉంటాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుంటున్న నా పేరు సూర్య విషయంలో.. ఆ మాటకు వస్తే అసలు సమ్మర్ సినిమాల్లో అందరికంటే ముందు పబ్లిసిటీ యాక్టివిటీస్ స్టార్ట్ చేసింది బన్నీనే. న్యూఇయర్ రోజున ఫస్ట్ ఇంపాక్ట్ అంటూ చిన్నపాటి టీజర్ రిలీజ్ మూవీ థీమ్ గురించి చెప్పేశాడు.

ఆ తర్వాత పలు రకాల ప్రమోషన్స్ తో యాక్టివ్ గా ఉన్నా.. కొన్ని వారాలుగా ఈ ప్రచారానికి బ్రేక్ వేసిన అల్లు అర్జున్.. మళ్లీ ఇప్పుడు ప్రమోషన్స్ ను రీస్టార్ట్ చేసేశాడు. తన పుట్టిన రోజున డైలాగ్ ఇంపాక్ట్ అంటూ బాగానే రచ్చ చేశాడు అల్లు అర్జున్. ఇప్పటికే విడుదల చేసిన పాటలు కూడా బాగానే జనాలను మెప్పించాయి. నా పేరు సూర్య మూవీ నుంచి బ్యూటిఫుల్ అంటూ సాగే పాటను ఈ నెల 13న విడుదల చేయబోతున్నారు. అను ఇమ్మానుయేల్  తో పాడుకునే ఈ డ్యూయెట్ కి సంబంధించిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి మరీ.. తనే ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు బన్నీ. ఇక కొన్ని రోజుల గ్యాప్ లో ఇతర పాటలు కూడా ఆన్ లైన్ లోకి వచ్చేయనున్నాయట.

ఇవన్నీ కాకుండా ఈ నెల చివరి వారంలో గ్రాండ్ ప్రి రిలీజ్ వెన్యూ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇంకా వెన్యూ ఫిక్స్ చేయకపోయినా.. ప్రస్తుతం రెండు మూడు ప్రాంతాలలో పర్మిషన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మే4న థియేటర్లలోకి వచ్చే నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా మూవీ దేశభక్తి థీమ్ కి సంబంధించిన చిత్రం కావడంతో.. కొన్ని స్పెషల్ ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేశారట.
Tags:    

Similar News