చ‌రణ్ సినిమాలో బ‌న్నీ...న‌మ్మొచ్చంటారా?

Update: 2016-08-20 17:30 GMT
బన్నీ గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. `డాడీ` సినిమా మొద‌లుకొని బ‌న్నీ ఎప్పుడు గెస్ట్‌ గా క‌నిపించినా బొమ్మ సూప‌ర్‌ హిట్టే. డాడీలో డ్యాన్స‌ర్‌ గా ఒక నిమిషం పాటు మెరిశాడు బ‌న్నీ. `వావ్‌... వాట్టే డ్యాన్స్  - ఎవ‌రీ కుర్రాడు?` అంటూ అంతా ఆయ‌న  గురించి ఆరా తీశారు. చ‌ర‌ణ్ సినిమా `ఎవ‌డు`లోనూ మెరిశాడు. ఆ సినిమా కూడా సూప‌ర్‌ హిట్టే. ఈమ‌ధ్య రుద్ర‌మ‌దేవిలో గోన గ‌న్నారెడ్డి పాత్రతో ర‌క్తిక‌ట్టించాడు. ఆ సినిమాకే  హైలెట్టుగా నిలిచాడు. ఈ రిజ‌ల్ట్‌ ని చూసే బ‌న్నీని అంద‌రూ ల‌క్కీగా భావిస్తూ ఆయ‌న‌తో గెస్ట్ అప్పీరెన్స్ ఇప్పించుకోవాల‌నుకొంటున్నారు. బ‌న్నీ త‌మ్ముడు అల్లు శిరీష్ త‌న సినిమాలో అన్న‌య్య క‌నిపిస్తే బాగుంటుంద‌ని అనుకొంటున్నాడు. శిరీష్ కొత్త సినిమాలో అల్లు అర్జున్ క‌నిపించ‌బోతున్నాడ‌ట అని ప్ర‌చారం సాగుతున్న ద‌శ‌లోనే మ‌రో కొత్త విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

రామ్‌ చ‌ర‌ణ్ సినిమా `ధృవ‌`లోనూ  అల్లు అర్జున్ గెస్ట్‌ గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. బ‌న్నీ పాత్ర అందులో ఐదు నిమిషాలు ఉంటుంద‌ని చెబుతున్నారు. చ‌ర‌ణ్‌ పై ఉన్న ప్రేమ‌కితోడు - ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌ రెడ్డి బ‌ల‌వంతం మేర‌కు బ‌న్నీ ఆ సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకొన్న‌ట్టు తెలిసింది. మ‌రి అందులో నిజ‌మెంత‌న్న‌ది తెలియాలంటే మాత్రం చిత్ర‌బృందం స్పందించాల్సిందే.
Tags:    

Similar News