ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప' గత ఏడాది డిసెంబర్ లో విడుదలై ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. హడావిడిగా విడుదలైనా ఈ మూవీకి దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులు రికార్డు స్థాయిలో విజయాన్ని అందించి బ్రహ్మరథం పట్టారు. ఉత్తరాదిలో హిందీ వెర్షన్ కు ఊహించని స్థాయి విజయం దక్కింది. అదే తరహాలో ఈ మూవీ అక్కడ భారీ వసూళ్లని రాబట్టింది. ఏకంగా హిందీ బెల్ట్ లో పుష్ప వంద కోట్లని కొల్లగొట్టడం ప్రతీ ఒక్కరినీ విస్మయపరిచింది.
అల్లు అర్జున్ తొలిసారి ఊరమాస్ క్యారెక్టర్ లో గంధపు చెక్కలు నరికే కూలోడుగా రగ్గ్‌డ్ పాత్రలో కనిపించడం, బిన్నమైన మేనరిజమ్, పాటలు, దేవి శ్రీ సంగీతం సినిమాని వరల్డ్ వైడ్ గా వైరల్ అయ్యేలా చేసింది. దీంతో సినిమా అన్ని వర్గాల, భాషలకు సంబంధించిన ప్రేక్షకులకు అత్యంత చేరువయ్యింది. తొలి పార్ట్ 360 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడంతో దీనికి సీక్వెల్ గా రానున్న 'పుష్ప 2'పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
వాటిని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుకుమార్ స్క్రీప్ట్ లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆ కారణంగానే రెగ్యులర్ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. బడ్జెట్ ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ వారు 'పుష్ప 2' కోసం భారీగా పెంచేశారు. ఏకంగా రూ.350 కోట్లతో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని త్వరలో మొదలు పెట్టబోతున్నారు.
ఈ నేపథ్యంలో రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా?... 'పేష్ప 2' ఎలా వుండబోతోందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు హీరో అల్లు అర్జున్ తాజాగా సాలీడ్ అప్ డేట్ ని అందించి వాళ్లలో వున్న జోష్ ని రెట్టింపు చేయడంవిశేషం.
అల్లు శిరీష్ నటించిన 'ఊర్వశీవో రాక్షసివో' సక్సెస్ సెలబ్రేషన్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు అర్జున్ 'పుష్ప2'పై సాలీడ్ అప్ డేట్ ని అందించడం విశేషం. బన్నీని ఫంక్షన్ లో చూసిన ఫ్యాన్స్ అంతా 'పుష్ప 2' కోసం అడుగుతూ ఊలలు.. కేకలు వేస్తుంటే బన్నీ అసలు విషయం బయటపెట్టాడు.
నాకు తెలుసు.. మీరందరూ 'పుష్ప 2' అప్ డేట్స్ గురించి అడుగుతున్నారు. నేను మీకు ఓ చిన్న అప్ డేట్ ఇస్తా.. పుష్ప 1 దగ్గేదేలే.. పుష్ప 2 మాత్రం అస్సలు తగ్గేదేలే.. డెఫినెట్ లీ పాజిటివ్ గా వుంటుందని అనుకుంటున్నాను. నేను ఎక్సైట్ అయ్యాను.. మీరు కూడా నాలాగే ఎక్సైట్ అవుతారని గట్టి నమ్మకంతో వున్నాను' అని బ్లాస్టింట్ అప్ డేట్ ని అందించాడు. అంతే ఇంతకు ముందు కరోనా భయాల మధ్య ఎలాంటి ప్లానింగ్ లేకుండా వచ్చిన ఈ టీమ్ ఈ సారి పక్కా ప్లానింగ్ తో థియేటర్లలని పాన్ ఇండియా రేంజ్ కి మించి దద్దరిల్లేలా చేయడం ఖాయం అని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.