అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా అనుకున్నదాని కంటే డబుల్ వసూళ్లను దక్కించుకోవడంతో పాటు ప్రశంసలు దక్కించుకుంది. తెలుగు లో పుష్ప ఖచ్చితంగా బాగా ఆడుతుంది కాని ఇతర భాషల్లో పెద్దగా ప్రమోట్ చేయలేదు కనుక అక్కడ ఎలా వసూళ్లను తెచ్చి పెడుతుందో అనే అనుమానాలు చాలా మందిలో కనిపించాయి. కాని అనుమానాలను పటా పంచలు చేస్తూ తెలుగు లోనే కాకుండా హిందీ.. తమిళం.. కన్నడం మరియు మలయాళంలో కూడా భారీగా వసూళ్లను దక్కించుకుంది. ఇండియాలోనే కాకుండా ఇండియా బయట కూడా పుష్ప సినిమా తగ్గేదే లే డైలాగ్ కు న్యాయం చేసినట్లుగా అనిపించింది. అల్లు అర్జున్ పుష్ప సినిమా తో ఆస్ట్రేలియాలో అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు.
ఆస్ట్రేలియా లో మొత్తంగా 5.7 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీ లో మూడు కోట్లకు పైమాటే. కేవలం ఆస్ట్రేలియాలో ఇంత భారీగా వసూళ్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇది నాన్ బాహుబలి రికార్డ్ గా ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను పుష్ప ఆస్ట్రేలియాలో కూడా దక్కించుకుని బన్నీ తన స్టార్ డమ్ ను నిరూపించుకున్నాడు. ఇప్పటికే తన అల వైకుంఠపురం లో వసూళ్లతో ఆస్ట్రేలియాలో నాన్ బాహుబలి రికార్డును దక్కించుకున్నాడు. ఇప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు. అల వైకుంఠపురం లో సినిమా కంటే ఎక్కువగా ఆస్ట్రేలియాలో పుష్ప సినిమా రాబట్టి నాన్ బాహుబలి సినిమాల జాబితాలో నెం.1 గా నిలిచింది.
అల్లు అర్జున్ మరియు సుకుమార్ ల కాంబోలో వచ్చిన పుష్ప సినిమా బాలీవుడ్ లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మొదటి రోజు కేవలం మూడు కోట్లకు అటు ఇటుగా వసూళ్లను దక్కించుకుంది. ఆ వసూళ్లను చూసి అంతా కూడా అవాక్కయ్యారు. ఎన్నో అంచనాల నడుమ బాలీవుడ్ లో విడుదల అయిన పుష్ప సినిమాకు మరీ ఇలాంటి పరిస్థితి ఏంటీ అన్నట్లుగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కాని రోజులు గడుస్తున్నా కొద్ది హిందీ పుష్ప వసూళ్లు పెరిగాయి. వీకెండ్స్ లో భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి.
బాలీవుడ్ లో సినిమాలు విడుదల లేకపోవడంతో పుష్ప నే వారికి దిక్కు అయ్యింది. అందుకే ఏకంగా 75 కోట్లకు పైగా వసూళ్లను ఈ సినిమా కేవలం ఉత్తర భారతంలో దక్కించుకుంది. ఇది కేజీఎఫ్ ను మించి అనే విషయంలో సందేహం లేదు. పుష్ప పార్ట్ 1 సాధించిన విజయంతో పార్ట్ 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి లో పుష్ప 2 పట్టాలెక్కబోతుంది. ఇదే ఏడాది డిసెంబర్ లో సెంటిమెంట్ కలిసి వచ్చేట్లుగా పుష్ప 2 ను కూడా విడుదల చేయబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. సినిమా విడుదల విషయంలో మరింత స్పష్టత క్లారిటీ రావాల్సి ఉంది.