బన్నీ కొత్త లుక్ అదిరింది

Update: 2016-03-30 09:09 GMT
అల్లు అర్జున్ కు స్టైలిష్ స్టార్ అని ఏ ముహూర్తాన నామకరణం చేశారో కానీ.. ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తానికి స్టైల్ ఐకానే అయిపోయాడీ మెగా హీరో. బన్నీ ఓ కొత్త సినిమా తీయబోతున్నాడటంటే.. అతడి ఫిజిక్ ఎలా ఉంటుంది.. హేర్ స్టైల్ ఎలా ఉంటుంది.. ఎలాంటి కాస్ట్యూమ్స్ వేస్తాడు.. కొత్త ఔట్ ఫిట్ ఏం పరిచయం చేస్తాడు.. మొత్తంగా అతడి లుక్ ఎలా ఉంటుంది.. అన్న చర్చ మొదలైపోతుంది జనాల్లో. ఈ చర్చ తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు కూడా. సౌత్ ఇండియా అంతటా అతడి అభిమానులు ఈ చర్చల్లో మునిగిపోతారు. అభిమానుల అంచనాలకు తగ్గట్లే తన ప్రతి సినిమాకూ సరికొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తుంటాడు బన్నీ.

బన్నీ కొత్త సినిమా ‘సరైనోడు’లో అతడి లుక్ ఇప్పటికే చర్చనీయాంశమైంది. కండలు మరింతగా పెంచి.. తొలిసారిగా మీసం పెంచి.. షార్ట్ హేర్ తో.. కొత్తగా కనిపించాడు బన్నీ. ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్న పోస్టర్లలతో కలకలమే రేపుతున్నాడు బన్నీ. తాజాగా ఏప్రిల్ 1న ఆడియో రిలీజ్ అని అనౌన్స్ చేస్తూ వదిలిన కొత్త పోస్టర్లోనూ బన్నీ లుక్ అదుర్స్ అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఓ పాట కోసం ట్రై చేశాడో ఏంటో.. మీసం మరింతగా పెంచి.. దాన్ని మెలితిప్పాడు బన్నీ. హేర్ కట్ కూడా చాలా స్టైలిష్ గా ఉంది ఇందులో. చెవిపోగు కూడా పెట్టాడు. మొత్తంగా ఈ లుక్ సింప్లీ సూపర్బ్ అనిపిస్తోంది. అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. సినిమా మీద అంచనాలు పెంచుతోంది.
Tags:    

Similar News