ఈ మధ్యన ప్రతీ మెగా ఫంక్షన్ లోనూ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటలు ప్రత్యేకంగా ఉర్రూతలూగిస్తున్నాయి. ఒక్కోసారి కాంట్రోవర్సీలకు దారితీస్తున్నాయి కూడా. ఇప్పుడు అందరూ కూడా ఖైదీ నెం 150 ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో మనోడు ఏం మాట్లాడతాడని అందరూ చూస్తున్నారు. అదిగో బన్నీ ఏమన్నాడంటే..
''దాదాపు.. దాదాపు పది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా ఈ రోజు కోసం .. నా ఆనందం అంతా ఇంతా కాదు.. నా ఫేస్ లో ఉన్న నవ్వు ఆగట్లేదు..
ట్రైలర్ మీరు ఎప్పుడు చూశారో.. నేను ఇప్పుడే చూశాను.. నా కాళ్ల నుంచి ఆనందం తన్ను కుంటూ వచ్చేస్తోంది... అన్నయ్యా.. దాదాపు పది సంవత్సరాలు గ్యాప్ వచ్చినా నేను మిమ్మల్ని మర్చిపోలేదు.. మాకు చూపించుకునే అవకాశం దొరకలేదు అన్నయ్యా.. అవకాశం వస్తే మేం వచ్చి చూపిస్తాం అని కదిలి వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను'' అంటూ ఆకట్టుకున్నాడు అల్లు అర్జున్.
''ఎన్నో మాట్లాడలేని విషయాల గురించి.. ఎన్నో చెప్పలేని విషయాల గురించి.. ఎన్నో చెప్పలేని బాధల గురించి ఫీలింగ్స్ గురించి.. అవమానాల గురించి అన్నిటికీ ఈ సినిమానే సమాధానం. ఈ సినిమానే కాదు.. ఈ సినిమా నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతీ సమాధానం ఎత్తిన ప్రతీ వేలు ముడుచుకోవాలి... జారిన ప్రతీ నోరు మూసుకోవాలి'' అంటూ పంచ్ లు వేశాడు.
ఇక సినిమా గురించి చెబుతూ.. ''చిరంజీవి గారిని ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటదో.. ఆల్మోస్ట్ గా ఏడెనిమిది ఏళ్లుగా నా కోరిక.. వివి వినాయక్ గారు తీస్తే అదిరిపోద్దని నా కోరిక. నా కోరిక ఏదో నా కోరిక అలాగే ఓ దీవెనలాగా వచ్చి చిరంజీవిగారిని అర్ధం చేసుకుని తీసే ఏకైక డైరెక్టర్ వివి వినాయక్.. అందులో ఏ మాత్రం మొహమాటం లేదు. నేను సినిమా ఫ్రేమ్ చూడలేదు. అన్నయ్య నువ్వు ఎలా చూపిస్తావో మేం ఠాగూర్ లో కూడా చూసేశాం. ఇప్పుడెలా చూపిస్తావో.. ఎంత ప్రేమ నీ గుండెల్లో ఉంటుందో.. ఎంత ప్రేమతో నువ్వు చిరంజీవి గారిపై ఫ్రేమ్ పెడతావో నాకు తెలుసు'' అంటూ వినాయక్ గురించి చెప్పాడు బన్నీ.
''నా మిత్రుడు.. లెట్స్ డు కుమ్ముడు.. దేవీ.. నీకు చిరంజీవి గారిపై ఉన్న ప్రేమ.. నీ మ్యూజిక్ లో చూపించావ్ థాంక్యూ.. అలాగే సినిమాలో పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పని చేశారు. ఇవాళ మాకు చీఫ్ గెస్ట్ గా వచ్చిన దాసరి నారాయణరావు గారికి.. సుబ్బిరామిరెడ్డి గారికి.. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నా. మినిస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు'' అని తెలిపాడు.
''ఈ సినిమా స్వీట్ వార్నింగ్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అంటూ మరో పంచ్ వేశాడులే.
''చిరంజీవి గారంటే మీరందరూ చూసేది డ్యాన్సు.. ఫైటు.. స్టెప్స్.. డైలాగ్స్.. మీరందరూ చిరంజీవి గారి దగ్గర నేర్చుకోవాల్సినది సంస్కారం.. ఆ సంస్కారంతోనే చెబుతున్నాను.. ఈ సంక్రాంతికి ఇంకో సినిమా వస్తోంది.. వాళ్లకు కూడా మా తరఫున మెగాస్టార్ తరఫున మెగా అభిమానుల తరఫున వుయ్ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్'' అంటూ గౌతమీపుత్ర శాతకర్ణికి విషెస్ తెలిపాడు.
''నేను ఎక్కువ మాట్లాడితే ఎక్కువ ఎమోషన్ అవుతానని కంగారుగా ఉంది. నేను కంట్రోల్ గా మాట్లాడానని అనుకుంటున్నా. ఈ కంట్రోల్ నాకిచ్చిననందుకు థాంక్యూ. ప్రతీ ఒక్క మెగాభిమానికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ.. జై చిరంజీవ'' అంటూ ముగించాడు అల్లు అర్జున్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/