అల్లు అర్జున్ తన అభిమానులకు ఒక స్పెషల్ న్యూస్ చెప్పడానికి ఒక తేదీని ఎంచుకున్నాడు. జనవరి 1న కొత్త సంవత్సరాది సందర్భంగా ఆ ప్రకటన చేస్తాడట. అతను ఏం చెబుతాడా అని అందరూ ఇప్పట్నుంచే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కొందరేమో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా విడుదల తేదీని అఫీషియల్ గా ఆ రోజు ప్రకటిస్తారని అంటుంటే.. ఇంకొందరేమో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి బన్నీ ప్రకట చేయబోతున్నారని అంటున్నారు. ఏదేమైనా రెండు నెలల తర్వాత చెప్పబోయే కబురు గురించి ఇప్పుడే అభిమానులకు హింట్ ఇచ్చి వారిలో ఉత్కంఠ రేకెత్తించాడు బన్నీ.
‘నా పేరు సూర్య’ సినిమాను ఏప్రిల్ 27న ‘ఖుషి’ రిలీజైన తేదీకే విడుదల చేస్తామని చిత్ర బృందం గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్యే మహేష్ బాబు కొత్త సినిమా ‘భరత్ అను నేను’ను కూడా అదే రోజు విడుదల చేయబోతున్నట్లు ఆ చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది . అయినప్పటికీ తాము తగ్గేది లేదంటూ బన్నీ మిత్రుడు బన్నీ వాసు ప్రకటించాడు. ఇదిలా ఉంటే.. ‘2.0’ సినిమాను జనవరి 25 నుంచి ఏప్రిల్ 13కు వాయిదా వేసినట్లుగా ఇటీవలే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27కు ‘నా పేరు సూర్య’.. ‘భరత్ అను నేను’ సినిమాలు రావడం సందేహంగా మారింది. వీటిలో ఏదో ఒకటి వాయిదా పడొచ్చని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో జనవరి 1 నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో.. బన్నీ ఏం ప్రకటన చేస్తాడో చూడాలి.