ఓటీటీలు.. కరోనా పాండమిక్ నేపథ్యంలో ప్రేక్షకులకు వినోదాన్ని అందించే ప్రత్యామ్నాయ మార్గాలుగా మారాయి. గత రెండేళ్లుగా తెలుగు ప్రేక్షకులకు డిజిటల్ వేదికలు బాగా దగ్గరయ్యాయి. డైరెక్ట్ ఓటీటీ రిలీజులను పరిచయం చేయడంతో పాటుగా.. సరికొత్త సినిమాలు - వెబ్ సిరీస్ లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
ప్రస్తుతం భారతదేశంలో ఓటీటీ రంగంలో ఎక్కువ వాటా కలిగి ఉన్న ఫ్లాట్ ఫార్మ్ లలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకటి. ప్రాంతీయ భాషల్లోనూ ఫోకస్ పెట్టిన ప్రైమ్.. ప్రారంభంలో పెద్ద సినిమాల హక్కులను కొనుగోలు చేసి స్ట్రీమింగ్ పెట్టింది. అయితే ఎందుకనో ఈ మధ్య తెలుగులో ఎక్కువ సినిమాలను తీసుకోవడం లేదని తెలుస్తోంది.
ఇటీవల కాలంలో అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్న సినిమా ఏదైనా ఉందంటే.. అది 'పుష్ప: ది రైజ్' మాత్రమే. మిగతా వన్నీ ఎవరికీ పెద్దగా తెలియని సినిమాలే. మరోవైపు ఇతర ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ తెలుగు కంటెంట్ మీద ఫోకస్ పెట్టి క్రేజీ చిత్రాలను కొనుగోలు చేస్తూ.. వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ సంస్థ ఇటీవల బ్లాక్ బస్టర్ సాధించిన 'అఖండ' సినిమాని దక్కించుకుంది. వచ్చే వారం విడుదలయ్యే 'భీమ్లా నాయక్' సినిమాని కూడా హాట్ స్టార్ వాళ్లే తీసుకున్నారని టాక్ నడుస్తోంది. రాబోయే మరికొన్ని పెద్ద చిత్రాల రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం.
ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ కూడా తెలుగులో 'శ్యామ్ సింగరాయ్' వంటి పలు సూపర్ హిట్ చిత్రాలను కొనుగోలు చేశారు. జీ5 ఓటీటీ బ్లాక్ బస్టర్ 'బంగార్రాజు' తో పాటుగా పలు పెద్ద చిత్రాలను తీసుకుంది. ప్రాంతీయ ఓటీటీ 'ఆహా' తెలుగు కంటెంట్ విషయంలో అగ్రస్థానంలో ఉంది. గత కొన్ని నెలలుగా ప్రతీ వారం ఓ క్రేజీ సినిమాని స్ట్రీమింగ్ పెడుతూ సబ్ స్క్రైబర్స్ ను పెంచుకుంటూ వెళ్తోంది.
కానీ అమెజాన్ ప్రైమ్ వీడియో మాత్రం తెలుగు కంటెంట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు అర్థం అవుతోంది. మునుపటిలా పోటీపడి పెద్ద సినిమాలను కొనుగోలు చేయడం లేదు. ఫ్యాన్సీ రేటుకు తీసుకున్న సినిమాలకు ఆశించిన స్థాయిలో వ్యూయర్ షిప్ లేకపోవడం వల్లనే ప్రైమ్ ఓటీటీ ఇలా వ్యవహరిస్తోందనే టాక్ ఉంది.
'పుష్ప' ను పక్కన పెడితే.. అమెజాన్ ఓటీటీలో ఈ మధ్య కాలంలో 'గమనం' 'గుడ్ లక్ సఖి' 'రామ్ అసూర్' 'ఏకమ్' వంటి చిన్న తెలుగు చిత్రాలు మాత్రమే స్ట్రీమింగ్ అయ్యాయి. మరోవైపు ప్రైమ్ లో తమిళ్ 'మహాన్' - హిందీ 'గెహ్రైయాన్' వంటి రెండు పెద్ద సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి రాబోయే రోజుల్లో అమెజాన్ వారు ఎలాంటి తెలుగు చిత్రాలను కొనుగోలు చేస్తారో చూడాలి.