రంగస్థలం మూవీ తొలి వీకెండ్ ముగిసేనాటికే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సెన్సేషనల్ హిట్ సాధించింది. అనితర సాధ్యమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఫస్ట్ డే వసూళ్లు మినహాయిస్తే.. దాదాపుగా నాన్ బాహుబలి రికార్డులు అన్నీ రంగస్థలం ఖాతాలోకి వచ్చేస్తున్నాయి. తమ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది రంగస్థలం టీం.
ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ రంగస్థలంలో తమ అనుభవాలను పంచుకోగా.. రంగమ్మత్తగా మెప్పించిన అనసూయ ఇచ్చిన సుదీర్ఘమైన స్పీచ్ హైలైట్ అవుతోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో హడావిడిగా పిలిచేసరికి పెద్దగా మాట్లాడలేకపోయానన్న అనసూయ.. సక్సెస్ మీట్ లో మాత్రం కాస్త ఎక్కువే మాట్లాడింది. సుకుమార్ నుంచి చిట్టిబాబు వరకూ ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ప్రశంసలు.. కృతజ్ఞతలతో పాటు క్షమాపణలు కూడా చెప్పింది.
రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో అత్తా అని పిలిపించుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడలేదని.. రంగమ్మా అని పిలిపించమని పోరు పెడుతూనే ఉన్నానని.. చెప్పింది అనసూయ.అయినా సరే.. తనతో కూడా 'ప్రేమంటే అంతేరా అల్లుడూ' అనడంతో పాటు రామ్ చరణ్ ను రెండు సార్లు అల్లుడు అని పిలిపించారని గుర్తు చేసుకున్న అనసూయ.. మీడియా జనాలకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పింది.
తనను ఆకాశంలోకి ఓసారి ఎత్తేయడం.. ఆ తర్వాత ఫట్ మని పడేయడం వంటివి అన్నీ మీడియా మిత్రులే చేశారని.. మళ్లీ ఇప్పుడు రంగమ్మత్తను తెగ పొగుడుతున్నారని చెప్పిన అనసూయ.. మీడియా తన గురించి పాజిటివ్ గా ఉండాలంటే తాను ఎలా ఉండాలో తెలియచేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది. అప్పట్లో ఓ యంగ్ స్టర్ చేతిలో నుంచి సెల్ ఫోన్ లాక్కుని పగలకొట్టడం ఇష్యూ అయింది కదా.. దాని గురించే ఇలా నర్మగర్భంగా చెప్పిన రంగమ్మత్త.. మళ్లీ అలాంటివి చేయనని చెప్పింది. అంతే కాదు.. రంగమ్మత్త అని పిలుపు చాలా ఎంజాయ్ చేస్తున్నానని అంటోంది ఈ స్టార్ యాంకర్ కం యాక్ట్రెస్.