వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ.. అషూ పశ్చాత్తాపం?
ఇది చూసిన నెటిజన్లు వెంటనే ఆర్జీవీ ఇంటర్వ్యూనే అని గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే, ఆ ఇంటర్వ్యూల తర్వాత అషూ, వర్మను మళ్లీ ఎక్కడా కలవలేదని పలువురు కామెంట్ చేస్తున్నారు.;
సెలబ్రెటీలు చేసే కొన్ని పనులు ఎన్నటికీ మర్చిపోలేనివిగా మారిపోతాయి. అటువంటి ఓ ఘటనలో అషూ రెడ్డి - రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ ప్రత్యేక స్థానం కలిగి ఉంది. అప్పట్లో ఈ ఇంటర్వ్యూలు ఎంత పెద్ద చర్చనీయాంశంగా మారాయో, ట్రోలింగ్ ఏ స్థాయిలో జరిగిందో అందరికీ తెలిసిందే. ఇంఫియన్ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన వర్మ ఏకంగా కాలు పట్టుకొని నోట్లో పెట్టుకోవడం అందరిని షాక్ కు గురి చేసింది. కానీ, తాజాగా ఈ అంశంపై అషూ రెడ్డి స్పందించడంతో ఈ అంశం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3తో గుర్తింపు తెచ్చుకున్న అషూ, ఆ తర్వాత కూడా యూట్యూబ్ ఇంటర్వ్యూలతో అందర్నీ ఆకర్షించింది. ముఖ్యంగా ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూలు బోల్డ్ కంటెంట్ కారణంగా ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాయి. అయితే, ఈ ఇంటర్వ్యూల వల్ల తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ప్రభావాన్ని అర్థం చేసుకున్నట్టుంది. తాజాగా, ఆమె తల్లి సమక్షంలో భావోద్వేగానికి లోనై క్షమాపణలు కోరడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇటీవల ఓ టీవీ షోలో అషూ తన తల్లితో కలిసి కనిపించింది. అందుకు సంబంధించిన ప్రోమోలో ఆమె కాస్త ఎమోషనల్‌గా మారి, ఇంటర్వ్యూకి కారణంగా తల్లికి బాధ కలిగించానని, అందుకే క్షమాపణలు కోరుతున్నానని చెప్పడం గమనార్హం. ఇది చూసిన నెటిజన్లు వెంటనే ఆర్జీవీ ఇంటర్వ్యూనే అని గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే, ఆ ఇంటర్వ్యూల తర్వాత అషూ, వర్మను మళ్లీ ఎక్కడా కలవలేదని పలువురు కామెంట్ చేస్తున్నారు.
అప్పట్లో ఓ కేఫ్‌లో అషూ-ఆర్జీవీ కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో అషూ వర్మ చెంపపై కొట్టడం, ఆయన దాన్ని ప్రేమగా తీసుకోవడం పెద్ద చర్చనీయాంశమయ్యాయి. అంతే కాదు, రెండో ఇంటర్వ్యూలో ఆర్జీవీ అషూ కాళ్లు పట్టుకొని మాట్లాడిన తీరు, అలాగే నోట్లో పెట్టుకోవడంపై పెద్ద దుమారం రేగింది. సినీ ప్రేమికులు దీనిపై తీవ్రంగా స్పందించగా, కొన్ని వర్గాలు మాత్రం దీన్ని సరదాగా తీసుకున్నాయి.
ఇలాంటి సంఘటనలు సినీ పరిశ్రమలో తరచూ జరుగుతూనే ఉంటాయి. కానీ, వ్యక్తిగతంగా వాటి ప్రభావం ఎంత ఉంటుందో మనం ఊహించలేం. అషూ కూడా అప్పట్లో అవి సరదాగా చేసినా, ఇప్పుడు వాటి వెనక ఉన్న ప్రభావాన్ని అర్థం చేసుకొని తల్లికి క్షమాపణలు కోరడం ఆమె ఎదుగుదలని సూచిస్తోంది. ఇక వర్మ కూడా మళ్లీ దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకునేలా ఒక బిగ్ పాన్ ఇండియా సినిమాను లైన్ లో పెడుతున్నట్లు టాక్.