ఆయ‌న మాస్ పంచ్ కు ముందే ఒణుకుతున్నాడే!

స‌న్ని డియోల్ తో తెరెక్కిస్తోన్న‌ `జాట్` సినిమాతో టాలీవుడ్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని బాలీవుడ్ లో మేక‌ర్ గా ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-03-14 12:30 GMT

స‌న్ని డియోల్ తో తెరెక్కిస్తోన్న‌ `జాట్` సినిమాతో టాలీవుడ్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని బాలీవుడ్ లో మేక‌ర్ గా ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది ప‌క్కా గోపీ మార్క్ యాక్ష‌న్ క‌మ‌ర్శియ‌ల్ చిత్రం. ప్రస్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు మంచి బ‌జ్ ని తీసుకొస్తున్నాయి. ఇందులో స‌న్ని డియోల్ ని ఢీకొట్టే విల‌న్ పాత్ర‌లో ర‌ణ‌దీప్ హుడా న‌టిస్తున్నాడు.

కొన్ని రోజ‌లు క్రిత‌మే ఈ పాత్ర‌కు సంబంధించిన ఇంట‌ర్ డ‌క్ష‌న్ వీడియోకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాలో విల‌న్ పాత్ర ఎంత బ‌లంగా ఉంటుంద‌న్న‌ది? అందులోనే చెప్పేసారు. దీంతో స‌న్ని డియోల్-ర‌ణ‌దీప్ హుడా మ‌ధ్య యాక్ష‌న్ స‌న్నివేశాలు నువ్వా? నేనా? అన్న రేంజ్ లో ఉంటాయి? అన్న దానిపై అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌న పాత్ర‌పై ర‌ణ‌దీప్ హుడా మ‌రోసారి స్పందించాడు.

ఇప్ప‌టి వ‌ర‌కూ కెరీర్ లో ఇలాంటి పాత్ర పోషించ‌లేదు. విల‌న్ పాత్ర ఇంత క‌ర్క‌శంగా ఉంటుంద‌ని మొద‌టి సారి చూస్తున్నాను. గ‌తంలోనూ చాలా చిత్రాల్లో న‌టించాను. కానీ ఇలాంటి ప‌వ‌ర్ ఫుల్ రోల్ చేయ‌డం ఇదే మొద‌టిసారి. షూటింగ్ ద‌శ‌లో పాత్ర చిత్ర‌ణ చూసి నేనే షాక్ అయ్యాను. సినిమాలో నా పాత్ర ఇంత బ‌లంగా ఉంటుంద‌ని ఊహించ‌లేదు. అందుకు గోపీచంద్ కు థాంక్స్ చెబుతున్నాను` అన్నారు.

మొత్తానికి గోపీచంద్ మాస్ ఫార్ములా బాలీవుడ్ లో వ‌ర్కౌట్ అయ్యేలా ఉంది. ఇలాంటి మాస్ అంశాల‌తోనే `పుష్ప` చిత్రం నార్త్ బెల్డ్ లో క‌నెక్ట్ అయింది. ఒక న‌టుడిని అలాంటి ఊర మాస్ లో ఉత్త‌రాది జ‌నాలు చూడ‌టం అదే తొలిసారి కావ‌డంతో? పుష్ప రెండు భాగాలు అఖండ విజ‌యాన్ని సాధించాయి. అదే టెక్నిక్ ప‌ట్టుకుని `జాట్` చిత్రాన్ని గోపీచంద్ హిందీలో తీస్తున్నాడు.

Tags:    

Similar News