బాల‌య్య కోసం అనిల్ క్రేజీ ప్లాన్‌!?

Update: 2022-09-19 15:42 GMT
నంద‌మూరి బాల‌కృష్ణ.. యాక్ష‌న్ సినిమాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ట్ చేసిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `అఖండ‌`తో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుని మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ అందించిన స‌క్సెస్ జోష్ లో వున్న బాల‌య్య బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ని లైన్ లో పెట్టేశాడు. `అఖండ` త‌రువాత బాల‌కృష్ణ ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ మూవీని చేస్తున్న విష‌యం తెలిసిందే.

NBK107 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీలో శృతిహాస‌న్‌, హ‌నీ రోస్ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. క‌న్న‌డ హీరో `దునియా` విజ‌య్ ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ గా న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ న‌టిస్తోంది. ఇటీవ‌లే క‌ర్నూల్ లో కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఇటీవ‌ల ట‌ర్కీలో ఓ రొమాంటిక్ సాంగ్ తో పాటు ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించుకుని హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేసింది.

న‌వంబ‌ర్ వ‌ర‌కు ఈ మూవీ షూటింగ్ ని పూర్తి చేయాల‌ని గోపీచంద్ మ‌లినేని ప్లాన్ చేస్తున్నాడు. డిసెంబ‌ర్ లేదా జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయాల‌న్న‌ది మేక‌ర్స్ ఆలోచ‌న‌. రీసెంట్ గా విడుద‌ల చేసిన ఫ‌స్ట్ గ్లింస్ ప‌వ‌ర్ ప్యాక్డ్ గా వుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ లో బాల‌కృష్ణ ప‌వ‌ర్ ఫుల్ రోల్ లో క‌నిపించిన స‌న్నివేశాలు ఫ్యాన్స్ కు పూన‌కాలు తెప్పిస్తున్నాయి. ఈ మూవీలో బాల‌య్య డ్యుయెల్ రోల్ లో తండ్రిగా, త‌న‌యుడిగా కనిపించ‌నున్నాడు.

ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత నంద‌మూరి బాల‌కృష్ణ త‌న 108వ ప్రాజెక్ట్ ని అనిల్ రావిపూడితో చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీలో బాల‌కృష్ణ వ‌య‌సు మ‌ల్లిన వ్య‌క్తిగా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఈ మూవీని షైన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై సాహు గార‌ప‌టి, హ‌రీష్ పెద్ది నిర్మించ‌బోతున్నారు.

ఈ మూవీలోని ఓ ప్ర‌త్యేక సాంగ్ కోసం రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌ని అడుగుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని, అన‌సూయ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డ‌మే త‌రువాయి అని తెలుస్తోంది. త‌ను ఓకే అంటే బాల‌య్య తో అదిరిపోయే ఐట‌మ్ నెంబ‌ర్ ఖాయం అని తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News