ఫోటో స్టొరీ: స్లిమ్ము గా ఉన్న సీతమ్మ

Update: 2018-09-15 11:22 GMT
హీరోయిన్స్ అందరూ స్లిమ్ గా ఉంటారు. కానీ అంజలి మొదటి నుండి కాస్త బొద్దుగా ఉండేదే.  'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో టైటిల్ పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులతో సీతమ్మ గా పిలిపించుకున్న అంజలి తర్వాత కాలంలో కోలీవుడ్ కు బేస్ షిఫ్ట్ చేసింది. అక్కడ చాలా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.  తాజాగా అంజలి సైమా అవార్డ్స్ లో తళుక్కున మెరిసింది.

సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2018 రీసెంట్ గా దుబాయ్ లో  స్టార్ట్ అయ్యాయి.  అంతపెద్ద అవార్డ్స్ సందడి ఉన్నప్పుడు తారల హంగామా లేకుండా ఉంటుందా?  అంజలి కూడా సైమా లో సందడి చేసింది.. సిమెంట్ కలర్ చీరలో.. అదే రంగు బ్లౌజ్ లో.. వాటికి తగ్గ యాక్సెసరీస్ ధరించి తో డ్యాన్స్ చేసింది. అఫ్ కోర్స్ వెనక డాన్సర్స్ కూడా ఉన్నారు. జస్ట్ డ్యాన్సు మాత్రమే అక్కడ హైలైట్ కాదు.  అంజలి స్లిమ్ అవతారం లో కనబడడమే అసలు హైలైట్.

సైమా సంగతి సరేగానీ ఈ మధ్య తన బాయ్ ఫ్రెండ్ జై తో బ్రేకప్ చేసుకుందని.. ఇప్పుడు సౌత్ లో ఉన్న ఎలిజిబుల్ సింగిల్స్ లో ఒకరని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే దాదాపు అరడజను సినిమాలు లైన్లో ఉన్నాయి.
Tags:    

Similar News