#RRR : 12-12-12 న కీలక ప్రకటన

Update: 2018-11-30 05:51 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి భారీ అంచనాల తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ మల్టీస్టారర్‌ చిత్రం మొదటి షెడ్యూల్‌ ముగింపు దశకు చేరుకుంది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ లు కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌ మూవీనిని జక్కన్న మ్యాజిక్‌ డేట్‌ అయిన 11 - 11 - 11 న ప్రారంభించిన విషయం తెల్సిందే. అప్పటి నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతూనే ఉంది. డిసెంబర్‌ 3న మొదటి షెడ్యూల్‌ ను ముగించనున్న రాజమౌళి కొత్త సంవత్సరంలో రెండవ షెడ్యూల్‌ ను ఆరంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్స్‌ ను ప్రకటించేందుకు రాజమౌళి సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రారంభంకు 11 తో కూడిన మ్యాజిక్‌ డేట్‌ ను తీసుకున్న రాజమౌళి ఈసారి 12తో కూడిన మ్యాజిక్‌ డేట్‌ అంటే 12 - 12 (డిసెంబర్‌ 12) 12 గంటలకు హీరోయిన్స్‌ ను అనౌన్స్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్‌ అని - ఒక హీరోయిన్‌ గా కీర్తి సురేష్‌ ఎంపిక అయ్యిందని ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. డిసెంబర్‌ 12న హీరోయిన్స్‌ ను రివీల్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

పీరియాడిక్‌ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని వార్తలు వస్తున్నాయి. కనుక హీరోయిన్స్‌ విషయంలో జక్కన్న ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రెండవ షెడ్యూల్‌ లో హీరోలతో పాటు హీరోయిన్స్‌ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. 2020వ సంవత్సరంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తుంది. ఈ చిత్రంలో చరణ్‌, ఎన్టీఆర్‌ ల లుక్స్‌ ఎలా ఉంటాయా అని ఇప్పటి నుండే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News