పొరుగింటి పుల్లకూర రుచి ఎక్కువ! అన్న సామెత `మన వాళ్లకు పక్కాగా వర్తిస్తుంది. మన స్టార్ హీరోలు స్ట్రెయిట్ తెలుగు దర్శకులకు అవకాశాలిచ్చే కంటే ఇరుగుపొరుగున సక్సెస్ సాధిస్తున్న దర్శకులను పిలిచి అవకాశాలిచ్చిన సందర్భాలు చాలా ఎక్కువ. ఇందుకు విక్టరీ వెంకటేష్.. పవన్ కల్యాణ్ .. మహేష్.. వీళ్లెవరూ అతీతులు కానేకాదు.
అయితే పొరుగు డైరెక్టర్లు తెలుగు స్టార్లతో వందకు వందశాతం సక్సెస్ సాధించారా? అంటే అందుకు ఛాన్సే లేదు. ఎస్.జె.సూర్య తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఖుషీ లాంటి బంపర్ హిట్ కొట్టినా కానీ ఆ తర్వాత ఫ్లాపునే ఇచ్చాడు. దీంతో ఆ జోడీ బ్రేకప్ అయ్యింది. పందెంకోడితో బంపర్ హిట్ కొట్టిన లింగుస్వామితో పని చేయాలని పవన్ .. బన్ని లాంటి స్టార్లు ఉవ్విళ్లూరారు. కానీ ఏ ప్రయత్నాలూ వర్కవుట్ కాలేదు.
ఎన్టీఆర్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ కోసం అశ్వనిదత్ తీవ్రంగానే సన్నాహాలు చేసినా ఎందుకనో మరోసారి దానికి సంబంధించిన అప్ డేట్ లేదు. స్పైడర్ లాంటి డిజాస్టర్ తీశాక మళ్లీ మురుగదాస పేరెత్తలేదు మహేష్. వరుసగా అవకాశాలిచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయిన కరుణాకరన్ కథ ఇక టాలీవుడ్ లో ముగిసిపోయింది. పవన్ - విష్ణువర్ధన్ కాంబో పంజా రిజల్ట్ ఊహించని దెబ్బ కొట్టడంతో మళ్లీ ఆ జోడీ కలిసే ప్రయత్నమే చేయలేదు.
ఓవరాల్ గా వీళ్లంతా ఏమయ్యారు? టాలీవుడ్ సర్కిల్స్ లో కనిపించరేం? అని వెతకాల్సిన పరిస్థితి. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ పరిస్థితి ఇదే. ఇప్పుడు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో నిరూపించుకోకపోతే అతడికి కష్టమే. మరో ఆఫర్ ఉండదన్న విశ్లేషణ సాగుతోంది. అయితే రంగుల మాయా ప్రపంచంలో ఎప్పుడు ఎవరు ఎలా ఎందుకు హిట్టు కొడతారో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ప్రతిభతో పాటు మంచి రిలీజ్ తేదీ.. థియేటర్లు.. అదృష్టం దాంతో పాటే చాలా చాలా కలిసి రావాలి.