అనుష్కశర్మ, సాక్షి చిన్నప్పటి ఫొటోలు వైరల్​..!

Update: 2021-04-21 04:44 GMT
టీమిండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ భార్య, ప్రముఖ నటి అనుష్క శర్మ, మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ భార్య సాక్షి బాల్య మిత్రులు అన్న విషయం తెలిసిందే. వాళ్లిద్దరూ చిన్నప్పుడు ఒకే స్కూల్​ లో చదువుకున్నారు. ఈ విషయాన్ని చాలా రోజుల క్రితం అనుష్క మీడియాకు చెప్పారు. అయితే వాళ్లిద్దరూ చిన్నప్పుడు స్కూల్​ లో ఉన్నప్పుడు తీయించుకున్న ఓ ఫొటో ఇప్పుడు వైరల్​ గా మారింది. అసోంలోని ఓ స్కూల్​ లో అనుష్క శర్మ, సాక్షి కలిసి చదువుకున్నారు. ఈ విషయాన్ని 2012లో ఓ ఇంటర్వ్యూలో అనుష్క మీడియాకు చెప్పింది. అయితే ఈ స్కూల్​ డేస్​ లో  తీయించుకున్న ఓ పిక్​ ఇప్పుడు వైరల్​ అవుతున్నది.

ఆ పిక్​లో సాక్షి ఓ ఏంజెల్​ వేషంలో కనిపిస్తున్నది. ఇక అనుష్క మాత్రం గాగ్రా చోలీ ధరించి మెరిసిపోతున్నది. చిన్నప్పుడు ఈ ఇద్దరు ఎంతో  క్యూట్​గా ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోని..  2010 జులై 4న సాక్షిని వివాహం చేసుకున్నాడు. ఇక 11 డిసెంబర్‌ 2017లో అనుష్క, కోహ్లీ ఒక్కటయ్యారు.విరాట్ కోహ్లీ, ధోనీలది ఇద్దరిది ప్రేమ వివాహమే.

ధోనీ ప్రస్తుతం ఐపీఎల్​ లో సీఎస్​కేకు కెప్టెన్ గా కొనసాగుతుండగా.. కోహ్లీ ఆర్​సీబీ జట్టును నడిపిస్తున్నాడు. వీళ్లిద్దరి లైఫ్ లో ఎన్నో కామన్​ పాయింట్లు ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు.. ఈ ఇద్దరు జంటలకు కూతుళ్లు  పుట్టారు. ధోని దంపతులు తమ కుమార్తెకు జీవా అని నామకరణం చేశారు. ధోనీ తన కూతురు అంటే వల్లమాలిన ప్రేమ. ధోనీ ఎక్కడికి వెళ్లినా తన కూతురిని వెంట తీసుకెళ్తుంటాడు. విరుష్క జంట ఇటీవలే తల్లిదండ్రులు అయ్యారు  వారు  తమ గారాలపట్టికి వామిక అని పేరు పెట్టారు.
Tags:    

Similar News