అప్ క‌మింగ్ రిలీజ్ ల్ని లిప్ లాక్ లు టెన్ష‌న్ పెడుతున్నాయా!

Update: 2022-02-10 01:30 GMT
హీరో-హీరోయిన్ల మ‌ద్య లిప్ లాక్ లు స‌హ‌జం. సీన్ డిమాండ్ చేస్తే లిప్ లాక్ త‌ప్ప‌దు. `అర్జున్ రెడ్డి` స‌క్సెస్ లో కంటెంట్ తో పాటు  లిప్ లాక్ లు కీ రోల్ పోషించాయి. అందులో కంటెంట్ డిమాండ్ చేసింది కాబ‌ట్టి లిప్ లాక్ పెట్ట‌డం..సీన్ హైలైట్ అవ్వ‌డం జ‌రిగింది. `అర్జున్ రెడ్డి` పూర్తిగా ల‌వ్ క‌మ్  రొమాంటిక్ జాన‌ర్ కాబ‌ట్టి అందులో లిప్ లాక్ లు అస్సెట్ గా నిలిచాయి. అయితే ఇటీవ‌లి కాలంలో రిలీజ్ అయిన కొన్ని సినిమాల్లోనూ లిప్ లాక్ లు ఉన్నాయి. `రౌడీ బోయ్స్` సినిమాలో హీరో అశిష్-హీరోయిన్  అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మ‌ధ్య ఘాడ‌మైన లిప్ లాక్ సీన్లు రెండు..మూడు ఉన్నాయి. అలాగే మ‌హేష్ మేనల్లుడు అశోక్ గ‌ల్లా డ‌బ్యూ మూవీ `హీరో`లోనూ లిప్ లాక్ ఉంది.

హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ తో అశోక్ లిప్ లాక్ వేసాడు. ఇటీవ‌లే నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన `శ్యామ్ సింఘ‌రాయ్` లోనూ కృతి శెట్టితో లిప్ లాక్ సీన్లు ఉన్న సంగ‌తి తెలిసిందే.  అయితే ఈ సినిమాలేవి బాక్సాఫీస్ వ‌ద్ద భారీ స‌క్సెస్ లు సాధించినివి కావు.  ఆ సినిమాల్లో లిప్ లాక్ లు హైలైట్ అయ్యాయి త‌ప్ప కంటెంట్ ప్ర‌ధానంగా హైలైట్ అవ్వ‌లేదు. మ‌రి లిప్ లాక్ వేసే అంత స‌న్నివేశం  అక్క‌డ డిమాండ్ చేసింది లేదు. లిప్ లాక్ లతో లాగించేయాల‌ని ఇరికించిన‌ట్లు ఉంది త‌ప్ప కంటెంట్ హైలైట్ అవ్వ‌లేదు. `శ్యామ్ సింఘ‌రాయ్` మాత్రం కంటెంట్ ప‌రంగా  ఆక‌ట్టుకుంది. ఇలా లిప్ లాకులు  వేసిన ఈ మూడు సినిమాలు యావ‌రేజ్ గా రాణించాయి.

మ‌రి ఇప్పుడు లిప్ లాక్ ల టెన్ష‌న్ అప్ క‌మింగ్ రిలీజ్ ల‌పై ప‌డిందా?  అంటే అవున‌నే గుస గుస వినిపిస్తోంది. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఖిలాడీ`లో మీనాక్షి చౌద‌రితో లిప్ లాక్ వేసాడు. ఇటీవ‌ల రిలీజ్  అయిన ట్రైల‌ర్ లోనే ఆ సీన్ ని హైలైట్ చేసారు. ఫ్రెంచ్ లిప్ లాక్ లో  జంట యూత్ ని టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపించింది. అలాగే యంగ్ హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టించిన `డీజే టిల్లు`లోనూ లిప్ లాక్ ఉంది. హీరోయిన్ నేహా శెట్టి- సిద్దు ల మ‌ధ్య లిప్ లాక్ సీన్ హైలైట్ అవుతుంద‌నే ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌మోష‌న్ లో ఈ రెండు చిత్రాల లిప్ లాక్ లు హైలైట్ అయ్యాయి త‌ప్ప కంటెంట్ ప‌రంగా ఎలా ఉంటుంద‌న్న‌ది రిలీజ్ అ యితే గా తెలియ‌దు.

 `అఖండ‌`..`పుష్ప` త‌ర్వాత రిలీజ్ అవుతోన్న పెద్ద చిత్రాల జాబితాలో `ఖిలాడీ` వ‌స్తోంది. బాల‌య్య‌..బ‌న్నీ ఇద్ద‌రు పెద్ద స‌క్సెస్ అందుకున్నారు. ఇక మాస్ రాజా స‌క్సెస్ కోస‌మే అభిమానులు వెయిట్ చేస్తున్నారు. `డీజే టిల్లు`కు మంచి బ‌జ్ క్రియేట్ అయింది. ప్ర‌చార చిత్రాలు యువ‌త‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి. మ‌రి యంగ్ హీరో ఏ మేర మెప్పిస్తాడో.
Tags:    

Similar News