యంగ్ డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల.. తన దర్శకత్వ ప్రతిభను ప్రూవ్ చేసేసుకున్నాడు. రెండో సినిమా జ్యో అచ్యుతానందతో మంచి విజయం సాధించి.. ద్వితీయ విఘ్నం దాటేశాడు. ఊహలు గుసగుసలాడే చిత్రంతో దర్శకుడిగా మారిన అవసరాల.. జ్యో అచ్యుతానందతో వరుసగా రెండో హిట్ కొట్టేశాడు. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ హంటర్ కి తెలుగు రీమేక్ లో లీడ్ రోల్ చేసేందుకు అంగీకరించిన ఈ కుర్రాడు.. అది పూర్తి కాగానే మళ్లీ మెగా ఫోన్ పట్టుకోనున్నాడు.
దర్శకుడిగా తన మూడో చిత్రానికి నేచురల్ స్టార్ నానిని హీరోగా తీసుకున్నాడు అవసరాల. వీళ్లిద్దరూ ఓ సినిమాకి కలిసి పని చేయడం ఇది మూడో సారి కానుంది. అష్టాచెమ్మాతో ఇంట్రడక్షన్ తర్వాత.. రీసెంట్ గా జ్యో అచ్యుతానందలో నాని గెస్ట్ రోల్ చేశాడు. ఇద్దరూ అష్టాచెమ్మాతోనే ఇండస్ట్రీకి పరిచయం కాగా.. ఇద్దరూ చెరో రూట్ లో ట్యాలెంట్ నిరూపించుకున్నారు. నాని స్టార్ హీరోగా ఎదిగితే.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నా అవసరాల. అష్టాచెమ్మా రోజుల నుంచి వీరిద్దరి మధ్యా మంచి బాండ్ ఉంది. ఈ ఫ్రెండ్ షిప్ ప్లస్ ఇద్దరి ట్యాలెంట్.. ఇప్పుడు ఇద్దరూ కలిసి సినిమా చేసేందుకు కారణం అవుతోంది.
'అవసరాల దర్శకత్వ ప్రతిభపై నాకు పూర్తి నమ్మకం ఉంది. తన ట్యాలెంట్ ని ఇప్పటికే చూపించేశాడు. వచ్చే ఏడాది శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నా' అని చెప్పాడు నాని.