జ్యోత్స్న.. అచ్యుత్.. ఆనంద్.. ముగ్గురూ కలిపితే ‘జ్యో అచ్యుతానంద’. సినిమాలో ఆ ముగ్గురివీ కీలక పాత్రలే. ఐతే జ్యోత్స్నతో పోలిస్తే అచ్యుత్-ఆనంద్ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తుంది. ఇక ఆ ఇద్దరి మధ్య పోలిక తీసుకొస్తే నారా రోహిత్ పోషించిన అచ్యుత్ పాత్రకు కొంచెం ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్లు అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో ఆ పాత్ర డామినేషన్ కనిపిస్తుంది. ఐతే తాను ఉద్దేశపూర్వకంగా రోహిత్ పాత్రను పెంచలేదని.. కథ రీత్యానే ఆ పాత్ర అలా కనిపిస్తుంది తప్ప మరేమీ కాదని అవసరాల చెప్పాడు.
‘‘ఇద్దరు అన్నదమ్ముల కథలో సంఘర్షణ రావాలంటే ఏదో ఒక పాత్రలో మార్పు రావాలి. ఆ మార్పు వచ్చేది రోహిత్ పాత్రలోనే కాబట్టి.. ఆ పాత్రలో వేరియేషన్స్ కనిపిస్తాయి. ఆ పాత్ర కొంచెం హైలైట్ అయింది. ఐతే రోహిత్.. శౌర్య ఇద్దరూ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో ఎవరినీ తక్కువ చేయడానికి లేదు. మామూలుగా ఓ పాత్రలో మార్పు వస్తే ఆ పాత్రను జనాలు ఎక్కువ ఇష్టపడతారు. కథలో ఇద్దరు అన్నదమ్ములూ ఒకేరకమైన మనస్తత్వంలో చూపిస్తే సంఘర్షణ ఉండదు. అందుకే అన్నయ్య అండ కోసం ఎదురు చూసే తమ్ముడిగా శౌర్య పాత్రను.. తమ్ముడిని సరిగా చూడని అన్నగా రోహిత్ క్యారెక్టర్ని డిజైన్ చేశాను. ఈ సినిమా ఏ ఒక్కరిదో కాదు. ఇద్దరు అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగే సినిమా. ఆ అన్నదమ్ముల్లో కదలిక తెచ్చే అమ్మాయి పాత్ర రెజీనాది. ముగ్గురూ ఈ సినిమాకు ప్రాణమే’’ అని అవసరాల విశ్లేషించాడు.