తెలుగు రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న టైం నుంచి అటు నిర్మాతల కళ్లు.. ఇటు డిస్ట్రిబ్యూటర్ల కళ్లు ఎప్పుడూ నైజాం మీదే ఉంటుంది. ఇదే తెలుగు సినిమాకు అత్యంత కీలకమైన మార్కెట్. ఆ తర్వాతే మిగతా ఏరియాలు. ఐతే గత కొన్నేళ్లలో మార్కెట్ లెక్కలు మారాయి. తెలుగు సినిమాల మార్కెట్ అన్ని ఏరియాల్లోనూ బలపడింది. కోస్తా ప్రాంతంలోని ప్రతి జిల్లాలోనూ మార్కెట్ విస్తరించింది. అలాగే సీడెడ్ (రాయలసీమ)లోనూ మార్కెట్ లెక్కలు మారిపోయాయి. ఐతే ఉత్తరాంధ్ర మీద మాత్రం ముందు నుంచి కొంచెం చిన్న చూపే ఉండేది. కానీ అక్కడ కూడా ఈ మధ్య వసూళ్ల లెక్కలు మారిపోతున్నాయి. కొత్తగా పెద్ద సినిమా వచ్చిన ప్రతిసారీ అక్కడ కలెక్షన్ల మోత మోగుతోంది. కొత్త బెంచ్ మార్క్ నమోదవుతోంది.
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ వైజాగ్ ఏరియాలో తొలిసారి రూ.10 కోట్ల షేర్ మార్కును దాటి చరిత్ర సృష్టించింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ కలెక్షన్లను కూడా ఆ సినిమా దాటేసింది. ఇప్పుడు ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఏకంగా రూ.15 కోట్ల మార్కును అందుకునేలా కనిపిస్తోంది. రెండు రోజుల్లోనే ఆ సినిమా అక్కడ రూ.7 కోట్లకు పైగా షేర్ రాబట్టడం విశేషం. ఆదివారం.. మే డే వసూళ్లతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు వచ్చేసేలా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర హక్కుల్ని సాయి కొర్రపాటి రూ.13 కోట్లకు దక్కించుకున్నారు. ఆయన రిస్క్ చేస్తున్నారని అనుకున్నారు కానీ.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి: ది కంక్లూజన్’కు సంబంధించి అత్యంత వేగంగా బ్రేక్ ఈవెన్ మార్కును టచ్ చేయనున్న ఏరియా వైజాగే కానుంది. చూస్తుంటే ఇకపై ప్రతి పెద్ద సినిమా కూడా ఇక్కడ రూ.10 కోట్ల మార్కే లక్ష్యంగా రేసులోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/