ఎస్.ఎస్.రాజమౌళి కీర్తి కిరీటంలో ఎన్నటికీ చెరిగిపోని తీపి గురుతు ఇది. ఇంతవరకూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సౌత్ సినిమా దిగ్గజాలు ఇద్దరే ఇద్దరు. అందులో ఒకరు సూపర్ స్టార్ రజనీకాంత్, మరొకరు దర్శక దిగ్గజం శంకర్. ఈ ఇద్దరికే ప్రపంచ సినీయవనికపై గుర్తింపు ఉంది. ఆ తర్వాత ఆ స్థాయిని టచ్ చేయగలిగిన స్టార్ కానీ, స్టార్ డైరెక్టర్ కానీ లేనేలేరు. కానీ ఇప్పుడు కొత్త చరిత్ర మొదలైంది. ఇప్పుడు ఆ ఛాన్స్ ఓ తెలుగోడికి కూడా వచ్చింది. రజనీ, శంకర్ తర్వాత అంతటివాడుగా రాజమౌళి కీర్తి అందుకుంటున్నారు. ఈ సంగతిని ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రికలు గార్డియన్, ఫోర్బ్స్ ప్రస్థావించాయి.
బాహుబలి ప్రపంచవ్యాప్తంగా రూ.250కోట్ల (180కోట్ల నెట్) గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఈ మ్యాగజైన్లు ఈ సంగతిని హైలైట్ చేశాయి. ఇప్పుడు భారతీయ సినిమాకి సిసలైన హీరో రాజమౌళి అంటూ కీర్తించాయి. భారతదేశంలో ఒక కొత్త స్టార్ పుట్టుకొచ్చాడని పొగడ్తలతో జక్కన్నని ఆకాశానికెత్తేశాయి. రజనీ నటించిన 'శివాజీ', 'రోబో' చిత్రాలకు అంతర్జాతీయంగా పేరొచ్చింది. వాటివల్ల రజనీ, శంకర్ ప్రపంచానికి బాగా తెలిసొచ్చారు. ఆ తర్వాత లింగా చిత్రం ఫ్లాపైనా రూ.200కోట్ల వసూళ్లతో చర్చల్లోకొచ్చింది. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలోని 'బాహుబలి' పాత రికార్డులన్నిటినీ చెరిపేసి రూ.250కోట్లు వసూలు చేసింది. అందుకే ఈ పొగడ్తలు అన్నమాట!