అబ్బో.. ఇదో షాకింగ్ న్యూసే.. అసలు రాజమౌళి స్పీడు చూస్తుంటే.. బాహుబలిః ది బిగినింగ్ (బాహుబలి పార్టు 1) కోసం 3 సంవత్సరాలు తీసుకున్న గురుడు.. ఇక బాహుబలి 2 సినిమాను 2016లో చెప్పినట్లు రిలీజ్ చేయకుండా.. ఏకంగా 2017 చివర వరకు సాగతీస్తాడేమో అని ఒక సందేహం వచ్చేసింది. అయితే ఈ రెండో పార్టు సంగతేమో కూడా.. ఇప్పుడు 3వ పార్టు కూడా తీస్తాడని తెలుస్తోంది.
నిజానికి బాహుబలి సినిమాను రూపొందిస్తున్న టైములో.. కథ లెంగ్త్ ఏమో కాని.. బడ్జెట్ తడసి మోపెడు అవుతోంది కాబట్టి.. సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తే నిర్మాతలు బాగా రికవర్ అవ్వొచ్చు అనే పందాలో ఆలోచించి.. సినిమాను టూ పార్ట్స్ గా చేశారు. అందుకే బాహుబలిః ది బిగినింగ్.. బాహుబలిః ది కంక్లూజన్ అంటూ పుట్టకొచ్చాయి. అయితే ఈ కథకు చాలా విధాలుగా ఎక్సటెన్షన్ చేయొచ్చని ఇప్పుడు ఫీలైన రాజమౌళి.. అసలు ఈ సినిమాను రెండో పార్టుతో ముగించేయకుండా.. హాలీవుడ్ లోని లార్డ్ ఆఫ్ ది రింగ్స్.. ది హాబిట్.. వంటి సినిమాల తరహాలో ఒక ట్రయోలజీగా తీర్చిదిద్దాలని ఫిక్సయ్యాడట. త్వరలోనే ఇదే విషయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.
బాహుబలి 2 ఒక్కటే కాదు.. ఏకంగా బాహుబలి 3 కూడా వస్తుందంటే.. ఇండియాలోనే మొట్టమొదటి ట్రయాలజీ ఫిలిం ఇదే అని చెప్పాలేమో. ఏదేమైనా రాజమౌళికే చెల్లుతుందంతే.