పెయిడ్‌ యాడ్స్‌ లేకుండానే 300కోట్లు

Update: 2015-07-20 15:58 GMT

క్రేజు అసాధారణంగా ఉండాలే కానీ పబ్లిసిటీకి అనవసర వ్యయం చేయాల్సిన పనేలేదు. ఆ సంగతిని ప్రాక్టికల్‌ గా నిరూపించి చూపించాడు రాజమౌళి. 'బాహుబలి : ది బిగినింగ్‌' ప్రచారం కోసం ఒక్క తెలుగు టీవీ చానెల్‌ కి నయా పైసా ఖర్చు చేయలేదంటే నమ్మగలరా? కానీ ఇది నిజం.

ఇటీవలే ఓ 14 మంది నిర్మాతలు ఓ మీటింగ్‌ పెట్టుకుని మరీ టీవీ చానెళ్ల కు యాడ్స్‌ కట్‌ చేస్తున్నామని ప్రకటించారు. ప్రచారం ఖర్చు తడిసిమోపెడవుతుంది. అందుకే ఇలా చేస్తున్నాం. కేవలం ఎంపిక చేసిన ఓ నాలుగు చానెళ్ల వరకూ ప్రకటనలు ఇస్తామని అన్నారు. కనీసం ఆ పని కూడా చేయలేదు బాహుబలి విషయంలో. ఇ-మీడియా మొత్తాన్ని ప్రకటనల విషయం లో దూరం పెట్టేశారు. అయినా ఇప్పటివరకూ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 80కోట్లు వసూలు చేసిందీ చిత్రం.

అయితే రిలీజ్‌ కి ముందే బాహుబలికి అవసరానికి మించి మీడియా ఊదరగొట్టేసింది. కాబట్టి ఇప్పుడు అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం నిర్మాతలకు లేదు. అయితే ప్రపంచ చరిత్ర లోనే ఇలా టీవీ చానెళ్ల కు ప్రకటనలు ఇవ్వకుండా ఈ రేంజు లో సినిమా హిట్టవ్వడం అనేది ఇదే తొలిసారి అనాలేమో!
Tags:    

Similar News