హాలీవుడ్ వాడికి తెలుగు మాట్లాడ్డం వస్తే తెలుగు సినిమాల్లో విలన్ లాగా.. ‘‘అసలెవడ్రా ఈ బాహుబలి’’ అనే అడుగుతాడేమో. యుఎస్ బాక్సాఫీస్ అంటే హాలీవుడ్ సినిమానే. అక్కడ టాప్ కలెక్షన్స్ ఎప్పుడూ హలీవుడ్ సినిమాలకే. ప్రతి వీకెండ్‌కూ యుఎస్ బాక్సాఫీస్‌కు సంబంధించి రిలీజ్ చేసే టాప్ లిస్టులో భారతీయ సినిమాలు టాప్-10లో కాదు కదా.. టాప్-50లో ఉండటం కూడా అరుదైన విషయమే. అలాంటిది ఓ తెలుగు సినిమా ఇప్పుడు టాప్-10లో చోటు దక్కించుకుంది.
మొన్నటి వీకెండ్‌లో యుఎస్ బాక్సాఫీస్ కలెక్షన్లలో బాహుబలికి పదో స్థానం దక్కింది. మినియన్స్ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత వరుసగా జురాసిక్ వరల్డ్, ఇన్‌సైడ్ ఔట్, టెర్మినేటర్ జెనిసిస్, మాజిక్ మైక్, ది గాలోస్, టెడ్-2, సెల్ఫ్‌లెస్, మ్యాక్స్, బాహుబలి ది బిగినింగ్ ఉన్నాయి. వార్నర్ బ్రదర్స్ వారి మ్యాక్స్ సినిమా కంటే కూడా తొలి రోజు బాహుబలికే ఎక్కువ కలెక్షన్లు ఉండటం విశేషం. ఐతే తర్వాతి రెండు రోజుల్లో బాహుబలిని దాటేయడం వల్ల మ్యాక్స్ తొమ్మిదో స్థానంలో ఉంది కానీ.. లేదంటే బాహుబలి ఇంకొంచెం పైనే ఉండేది.
యుఎస్ బాక్సాఫీస్ లెక్కల ప్రకారం తొలి రోజు 1,31,5000 డాలర్లు, రెండో రోజు 1,33,0000 డాలర్లు, మూడో రోజు 9,30,000 డాలర్లు కొల్లగొట్టింది. ఐతే తెలుగు సినిమా యుఎస్ బాక్సాఫీస్ కలెక్షన్లలో టాప్-10లో చోటు సంపాదించడం ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు 2007లో జల్సా సినిమా కూడా ఈ ఘనత దక్కించుకుంది.