బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందో చెప్పిన బాబుగోగినేని

Update: 2018-08-16 07:03 GMT
బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బ‌య‌ట‌కు వ‌చ్చిన బాబుగోగినేని తాజాగా ఒక ఛాన‌ల్ తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా బిగ్ బాస్ హౌస్ గురించి..లోప‌ల ఉండే ప‌రిస్థితుల గురించి.. అక్క‌డి వాతావ‌ర‌ణం గురించి చెప్పుకొచ్చారు. షోలో పార్టిసిపేట్ చేసే వారిని కాపాడేందుకు ఆర్మీలు త‌యారు చేయ‌టంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ల‌టం ఎంత సంతోషంగా వెళ్లానో.. అంతే సంతోషంగా తాను తిరిగి వ‌చ్చిన‌ట్లుగా చెప్పారు. చాలామంది బిగ్ బాస్ హౌస్ అంటే ర‌బ్బిష్ చేస్తున్న‌ట్లుగా అదో పిచ్చోళ్ల స్వ‌ర్గం అని అనుకోకూడ‌ద‌న్నారు. ఆర్మీ మీద ఇంట్ర‌స్ట్ ఉంటే సైన్యంలో చేరాలే  కానీ.. ప్రేక్ష‌కులు ఆర్మీగా త‌యారు కావ‌టం స‌రికాద‌న్నారు.

బిగ్ బాస్ అనేది సైక‌లాజిక‌ల్ ప్రెష‌ర్ కుక్క‌ర్ లాంటిద‌ని.. ఆ ప్రెజ‌ర్ కుక్క‌ర్ లో మ‌నం బ‌త‌క‌గ‌ల‌మా?  లేదా? అనేది ఆ  షోకి వెళ్లిన ప్ర‌తిఒక్క‌రూ తెలుసుకునే వీలు ఉంటుంద‌ని చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో స‌రైన తిండి ఉండ‌ద‌ని.. ఓ ప‌క్క ఆక‌లి.. అంత‌కు మించి.. స‌రైన నిద్ర ఉండ‌ద‌న్నారు.

ఆ షోలో పాల్గొన్న వారంతా ఐదేసి కేజీల చొప్పున త‌గ్గార‌న్నారు. షోలో తాను మాత్రం తాను ఎలా ఉండాలో అలానే ఉన్నానే త‌ప్పించి.. వేరేలా మార‌లేద‌న్నారు. లోప‌ల ఉన్న గేమ్ ను.. దాన్లోని కంటెస్టెంట్స్ ను ప‌బ్లిక్ అడాప్ట్ చేసుకునే తీరును త‌ప్పు ప‌ట్టారు. వీళ్లు నా క్యాండిడేట్‌.. వీళ్ల‌నే నేను గెలిపిస్తాన‌ని అనుకోవ‌టం స‌రికాద‌న్నారు. ఇందులో భాగంగా సైన్యాలు ఏర్పాటు చేయ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు.

సైన్యం అన్న‌ది పెద్ద మాట అని.. ఈ షోలో గెలిస్తే ఏంటి?  ఓడితే ఏంటి? అంటూ ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. దీన్నో ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఒక‌ళ్ల‌కు ఒక‌ళ్లు వ్య‌తిరేకంగా తిట్టుకోవ‌టం ఎందుకు? అన్న సందేహాన్ని వ్య‌క్తం చేశారు. కొంద‌రు ప్రెజ‌ర్లో త‌ప్పులు చేసి ఉండొచ్చ‌ని..అదంతా ఒత్తిడి పుణ్య‌మేన‌ని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News