బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ఒక రోజు ముందుగానే సోషల్ మీడియాలో లీకవుతోన్న సంగతి తెలిసిందే. ఆదివారం ఎపిసోడ్ ను ఒక రోజు ముందుగానే షూట్ చేయడం....అందులోనూ బిగ్ బాస్ సెట్లో పనిచేసే వారు తెలుగువారు కావడంతో ఈ లీకులు ఆగడం లేదు. గత 5 వారాలుగా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ఒక రోజు ముందుగానే ప్రేక్షకులకు తెలిసిపోవడంతో ఆ కిక్కు మిస్సవుతోంది. కానీ, ఈ విషయంలో బిగ్ బాస్ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఇదే క్రమంలో, తాజాగా ఈ వారం బిగ్ బాస్ నుంచి ప్రముఖ హేతువాది బాబు గోగినేని ఎలిమినేట్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో లీకులు మొదలయ్యాయి. దానికితోడు బాబు గోగినేనికి అతి తక్కువ ఓట్లు పోల్ కావడంతో ఆయన ఎలిమినేషన్ ఖాయమని టాక్ వస్తోంది.
ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో శ్యామల - గీతామాధురి - దీప్తి నల్లమోతు - గణేష్ - తనీష్ - బాబు గోగినేని ఉన్నారు. అయితే, వీరందరిలోకి గోగినేనికి తక్కువ ఓట్లు పోలయ్యాయి. దీంతో, ఆయన ఎలిమినేషన్ ఖాయమని ఊహాగానాలు వస్తున్నాయి. దానికి తోడు, గత రెండు వారాలుగా గోగినేని ప్రవర్తనలో తేడా వచ్చింది. కౌశల్ - గీతామాధురిలతో ఆయన గొడవ పడ్డారు. దీంతో, వారి ఫ్యాన్స్ బాబుపై గుర్రుగా ఉన్నారు. దానికితోడు, గత వారం కొన్ని టాస్క్ ల సందర్భంగా బాబు...క్రీడాస్ఫూర్తిని చూపలేదు. దీంతో,ఆయనపై కొద్దిగా వ్యతిరేకత వచ్చింది. అంతేకాకుండా, బిగ్ బాస్ నుంచి వెళ్లిపోవాలనుంది అని బాబు స్వయంగా రెండు సందర్భాల్లో అన్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవడంతోపాటు...సోషల్ మీడియాలో తాజాగా వస్తోన్న లీకుల నేపథ్యంలో ఈ సారి బాబు గోగినేని వికెట్ పడడం ఖాయంగా కనిపిస్తోంది.