పిల్లల్ని చూస్తే పెద్దవాళ్లు కూడా పిల్లలైపోతారు అంటారు. నందమూరి బాలకృష్ణ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. మనవడు దేవాన్ష్ పుట్టాక తనలో చాలా మార్పు వచ్చేసిందని.. తనతో ఆడుకుంటూ ఉంటే తనకు లోకమే తెలియదని.. తమ ఇద్దరిదీ వేరే లోకమని అంటున్నాడు బాలయ్య. తామిద్దరం కలిసి చాలా అల్లరి చేస్తామని.. అందుకే తనను చూస్తే పిల్లలందరూ ‘గోల తాతయ్య వచ్చాడు’ అంటారని ఇంతకుముందోసారి ఇంటర్వ్యూలో బాలయ్య చెప్పిన సంగతి తెలిసిందే. ఐతే తనను ‘గోల తాతయ్య’ అంటే.. తాను మాత్రం తన వియ్యంకుడు చంద్రబాబును మాత్రం ‘సుత్తి తాతయ్య’ అంటానని బాలయ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అందుకు కారణం ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘అసలు కన్నా వడ్డీనే ముద్దు అని పెద్దలు చెబుతారు. నాన్నకు మా కన్నా మా పిల్లలపై ఎక్కువ ఇష్టం ఉండేది. ఆయన ఎంత బిజీగా ఉన్నా పిల్లలు కనిపించగానే చిన్నపిల్లాడిలా అయిపోయేవారు. నేనూ అంతే. మా మనవడు దేవాన్ష్ తో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాను. ఖాళీ దొరికితే చాలు వాడితో ఆడుకుంటూ ఉంటాను. బుడ్డోడా బుడ్డోడా అంటూ ఉంటాను. వాడితో నేను చేసే అల్లరి అంతా ఇంతా కాదు అందుకే నన్ను ‘గోల తాతయ్య’ అంటారు. ఐతే మా బావ చంద్రబాబు మాత్రం అన్నీ ఓ పద్ధతి ప్రకారం జరగాలంటారు. ఆయన పిల్లాణ్ని కూడా ఓ పద్ధతి ప్రకారమే ఎత్తుకుంటారు. అందుకే నేను ఆయనకు ‘సుత్తి తాతయ్య’ అని పేరు పెట్టాను’’ అని బాలయ్య వెల్లడించాడు.