అసిస్టెంటును కొట్టిన బాలయ్య

Update: 2017-08-03 09:16 GMT
నందమూరి బాలకృష్ణ షార్ట్ టెంపర్ ఎలాంటిదో చెప్పే ఉదంతాలు గతంలోనూ కొన్ని బయటికి వచ్చాయి. తాజాగా మరోసారి బాలయ్య తనలోని ఇంకో కోణాన్ని చూపించాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తన కొత్త సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా బాలయ్య అదుపు తప్పాడు. అందరూ చూస్తుండగా.. తన అసిస్టెంటను బాలయ్య కొట్టేశాడు. ఆ కొట్టిన కారణం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. గత కొన్ని గంటల నుంచి బాలయ్య ప్రతాపానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముహూర్తపు షాట్ కు రెడీ అవుతున్న సమయంలో.. తన అసిస్టెంటును కేక వేసి పిలిచి మరీ చెంప చెల్లుమనిపించాడు బాలయ్య. చెంపదెబ్బ కొట్టాక కింది వైపు చూసి ఏదో సంజ్న చేశాడు. ఆ అసిస్టెంట్ వంగి బాలయ్య కాళ్లకు ఉన్న చెప్పులు విడిపించాడు. ఆ సమయంలో దర్శకుడు కె.ఎస్.రవికుమార్ బాలయ్య ముందే ఉండగా.. అసిస్టెంటుని ఎందుకు కొట్టాల్సి వచ్చిందో చెబుతున్నట్లుగా కనిపించింది ఆ వీడియోలో. రవికుమార్ సహా బాలయ్య చుట్టూ ఉన్న వాళ్ల ఫేసులు అదోలా మారిపోగా.. బాలయ్య వెనుక ఉన్న వ్యక్తి మాత్రం వెకిలిగా నవ్వుతూ కనిపించాడు.

బాలయ్య బహిరంగ వేదికల్లో ఇలా కంట్రోల్ తప్పడం ఇది తొలిసారి కాదు. గతంలో తన పుట్టిన రోజు వేడుకలకు హాజరైన అభిమానుల్లో ఒకరిని బాలయ్య కొట్టిన ఉదంతం గుర్తుండే ఉంటుంది. మరో సందర్భంలో ఓ అభిమాని ఫొటో తీయబోతుంటే.. ఫోన్ తీసి విసిరి కొట్టాడు. ఇక హిందూపురం ఎమ్మెల్యే స్థానానికి నామినేషన్ వేసిన సమయంలో తన అసిస్టెంటుతో అనుచితంగా ప్రవర్తించాడు. అలాగే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసి బయటికి వచ్చాక టీవీ కెమెరాల ముందు ఆయన పచ్చి బూతు వాడటమూ వివాదాస్పదమైంది. అంత పెద్ద స్టార్ అయి ఉండి.. ఎమ్మెల్యే పదవిలో కూడా ఉన్న బాలయ్య ఇలా ప్రవర్తించడం చర్చనీయాంశమవుతోంది.

Full View

Tags:    

Similar News